ఆళ్లకు గ్యారంటీ అట

ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు. కరకట్ట కమల్ హాసన్ అని ఆయనను ముద్దుగా పిలుకుంటారు. అలాగే ప్రత్యర్థులు కూడా కరకట్ట కంత్రీ అంటుంటారు. [more]

Update: 2020-02-19 12:30 GMT

ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు. కరకట్ట కమల్ హాసన్ అని ఆయనను ముద్దుగా పిలుకుంటారు. అలాగే ప్రత్యర్థులు కూడా కరకట్ట కంత్రీ అంటుంటారు. ఇలా ఎవరికి తోచిన పేర్లతో వారు పిలుచుకునే ఆళ్ల రామకృష్ణారెడ్డికి భవిష్యత్తులో మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని, ఈ రకమైన సంకేతాలను జగన్ ఇప్పటికే ఇచ్చారంటున్నారు.

ఎన్నికల ప్రచారంలోనే…..

నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మొన్నటి ఎన్నికల ప్రచారంలోనే జగన్ మాట ఇచ్చారు. మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తొలి దఫా మంత్రివర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి చోటు దక్కలేదు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. సామాజిక వర్గంతో పాటు జిల్లాల వారీ లెక్కలు కూడా ఆళ్లకు కలసి రాలేదు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

అమరావతి విషయంలోనూ…..

అయితే ఇప్పుడు మూడు రాజధానుల అంశం తెరమీదకు వచ్చింది. అమరావతిలో కేవలం శాసనసభ మాత్రమే ఉండనుంది. లెజిస్లేచర్ క్యాపిటల్ గానే అమరావతిని ఉంచనున్నారు. జగన్ నిర్ణయంతో మంగళగిరి ప్రాంతంలో ప్రభుత్వం పై కొంత వ్యతిరేకత వస్తుంది. ఈ ప్రభావం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై పడనుంది. తనకు ఇబ్బంది అని తెలిసినా ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించారు.

ఎక్కువ ఇబ్బంది పడేది…..

రైతులను స్వయంగా జగన్ వద్దకు తీసుకువెళ్లి వారి సమస్యలను విన్పించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎన్నికల్లో గెలవాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి కి మంత్రి పదవి ఇస్తే సొంత సామాజిక వర్గం వారు సయితం వ్యతిరేకించే అవకాశం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబుపై అలుపెరగని పోరాటం చేసిన ఆళ్లకు మంత్రి పదవి ఈసారి గ్యారంటీ అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News