తెరలు తొలగిపోతున్నాయే….!!
క్రమంగా తెరలు తొలగిపోతున్నాయి. పొత్తులపై స్పష్టత వచ్చేస్తుంది. తమిళనాడులో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పాగా వేయాలని ప్రతి పార్టీ వ్యూహాలు రచించుకుంటున్నాయి. దిగ్గజ నేతలు కరుణానిధి, [more]
క్రమంగా తెరలు తొలగిపోతున్నాయి. పొత్తులపై స్పష్టత వచ్చేస్తుంది. తమిళనాడులో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పాగా వేయాలని ప్రతి పార్టీ వ్యూహాలు రచించుకుంటున్నాయి. దిగ్గజ నేతలు కరుణానిధి, [more]
క్రమంగా తెరలు తొలగిపోతున్నాయి. పొత్తులపై స్పష్టత వచ్చేస్తుంది. తమిళనాడులో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పాగా వేయాలని ప్రతి పార్టీ వ్యూహాలు రచించుకుంటున్నాయి. దిగ్గజ నేతలు కరుణానిధి, జయలలిత మరణించిన తర్వాత అక్కడ పార్టీలకు ఒంటరిగా పోటీ చేసే సాహసంచేయలేకపోతున్నాయి. అధికార డీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలకు పటిష్టమైన క్యాడర్ ఉన్న ప్పటికీ నాయకత్వ లేమి, సరైన వ్యూహరచనలు లేకపోవడంతో ఇతర పార్టీలపైన ఆధారపడక తప్పని పరిస్థితి. అందుకోసమే పొత్తు లేకుండా ఒంటరిగా దిగడానికి రెండు ప్రధాన పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటితేనే పార్టీకి మనుగడ ఉంటుందని భావిస్తున్న రెండు పార్టీల అగ్రనేతలు ఇప్పటికే పొత్తుల కోసం చర్చల ప్రక్రియను ప్రారంభించారు.
కూటమి కోసం….
కరుణానిధి మరణం తర్వాత డీఎంకే కు స్టాలిన్ అధినేత అయ్యారు.అయితే కరుణానిధికి ఉన్నంత చరిష్మా ఆయనకు లేకపోవడం మైనస్ పాయింట్. ఇప్పటికీ కరుణానిధి పేరు ప్రస్తావించకుండా ఆయన ప్రసంగం మొదలు కాదు. పెద్దాయనే తనను లోక్ సభ ఎన్నికల్లో విజేతగా నిలుపుతారని స్టాలిన్ నమ్మకంగా ఉన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు కలసి వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుని వెళ్లాలని స్టాలిన్ నిర్ణయించారు. ఇప్పటికే స్టాలిన్ కాంగ్రెస్ తో పాటు వీసీకే, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే పార్టీల నేతలతో చర్చించారు. సీట్ల సర్దుబాటును కూడా త్వరలో తేల్చేయాలన్న ఉద్దేశ్యంతో స్టాలిన్ ఉన్నారు. సీట్ల సర్దుబాటు పూర్తయితే త్వరగా ప్రజల్లోకి వెళ్లవచ్చన్నది స్టాలిన్ ఆలోచన.
నాయకత్వ లేమితో….
ఇక అధికార అన్నాడీఎంకే పార్టీ విషయానికొస్తే పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత నాయకత్వం లేకుండా పోయిందనేచెప్పాలి. అధికారం ఉంది కాబట్టి ఆ మాత్రం పార్టీ నిలదొక్కుకుంది. జయలలిత ఏర్పరచిన ఓటు బ్యాంకు తమను కాపాడుతుందని భావిస్తున్నారు. కానీ గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు తమిళనాడులో లేవనేది వాస్తవం. పళనిస్వామి,పన్నీర్ సెల్వంలపై పార్టీ శ్రేణులకే నమ్మకం లేదు. ఇతర పార్టీల వైపునకు క్యాడర్, నేతలు తొంగిచూస్తున్నారు. దీంతో ఆ పార్టీ కూడా ధైర్యంగా పొత్తు లేకుండా వెళ్లలేకపోతోంది. భారతీయ జనతా పార్టీతో కలసి వెళ్లాలా? వద్దా? అన్నది ఇంకా నిర్ణయించుకోకపోయినా దాదాపుగా కలిసి వెళుతుందనే ప్రచారం జరుగుతోంది.
కమలంతో జట్టుకట్టాలని…..
తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 లోక్ సభ స్థానాలున్నాయి. ఇందులో డీఎంకే ముప్ఫయి లేదా ఇరవై అయిదు స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని భావిస్తోంది. మిగిలినవి మిత్రపక్షాలకు వదిలేస్తోంది. ఇక అధికార అన్నాడీఎంకే విషయానికొస్తే పీఎంకే, డీఎండీకే పార్టీలతో కలిసి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 27న తమిళనాడుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఆయన రాక సందర్భంగా పొత్తులపై చర్చలు జరిగే అవకాశముందని చెబుతున్నారు. బీజేపీ సాయం లేకుండా సొంతంగా అన్నాడీఎంకే పోటీ చేయబోదన్నది విశ్లేషకుల అంచనా. మొత్తం మీద కరుణానిధి, జయలలిత మరణంతర్వాత రెండు ప్రధాన పార్టీలూ పొత్తుల కోసం అర్రులు చాస్తున్నాయన్నదిచెప్పకతప్పదు.