ఆమంచికి చెక్ పెట్టాలనుకున్నా..? కుదిరే పని కాదని?

ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి చెందిన పాలిటిక్స్ మ‌రింత హీటెక్కాయి. నిన్నటి వ‌ర‌కు పార్టీలోకి కొత్తగా వ‌చ్చిన వారు కొన్ని స‌మ‌స్యలు సృష్టించార‌నే ప్రచారం సాగింది. [more]

Update: 2020-05-29 08:00 GMT

ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి చెందిన పాలిటిక్స్ మ‌రింత హీటెక్కాయి. నిన్నటి వ‌ర‌కు పార్టీలోకి కొత్తగా వ‌చ్చిన వారు కొన్ని స‌మ‌స్యలు సృష్టించార‌నే ప్రచారం సాగింది. అయితే, ఇప్పుడు ఒకే కుటుంబం లోని అన్నద‌మ్ములు కొట్టాడుకుంటున్నార‌నే ప్రచారం తాజాగా వెలుగు చూసింది. దీంతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లా రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చీరాల ని యోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే, పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ ఆమంచి కృష్ణమోహ‌న్‌.. ఓడిపోవ‌డం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ నేత క‌ర‌ణం బ‌ల‌రాం విజ‌యం సాధించారు.

ఆమంచిని పక్కన పెట్టాలంటూ…

అయితే, త‌న కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్ కోసం.. బ‌ల‌రాం.. వైసీపీకి మ‌ద్దతు ప‌లికారు. వెంక‌టేష్‌ను వైసీపీలో చేర్చారు. దీంతో చీరాల‌లో రెండు ఆధిప‌త్య కేంద్రాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే మా ఫాద‌ర్ కాబ‌ట్టి.. మామాటే చెల్లాల‌ని వెంక‌టేష్‌.. ఇప్పుడు పార్టీలోకి వ‌చ్చి పెత్తనం చేస్తామంటే.. ఎలా అని ఆమంచి వ‌ర్గాలు రోడ్డున ప‌డ్డాయి. దీంతో దీనిని స‌రిదిద్దేందుకు ఇప్పటికే రెండు సార్లు పంచాయితీ జ‌రిగింది. ఈ క్రమంలోనే ఆమంచిని ప‌క్కన పెట్టాల‌నే ప్రతిపాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ఆమంచి వ‌ల్ల పార్టీకి ఒరిగింది ఏమీ లేద‌ని.. కేవ‌లం దూకుడు మాత్రమేన‌ని రిపోర్టులు చేరిపోయాయి.

ఇన్ ఛార్జి పదవి తనకివ్వాలంటూ….

అదే స‌మ‌యంలో చీరాల వైసీపీ ఇంచార్జ్‌గా క‌ర‌ణం వెంక‌టేష్‌ను నియ‌మించాల‌ని, దీంతో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని, టీడీపీ నుంచి నేత‌లు క్యూ క‌ట్టుకుని వ‌చ్చి.. వైసీపీలో చేర‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీంతో దీనికి త‌గిన విధంగా మంత్రి బాలినేని శ్రీనివాస‌రావు.. స‌మ‌క్షంలో స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి వంటి వారు పంచాయితీ చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి వ‌చ్చిన ఆమంచి సోద‌రుడు.. స్వాములు .. త‌న త‌మ్ముణ్ని ఇంచార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని, అయితే, దానిని త‌న‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారని తాజాగా వార్తలు గుప్పుమ‌న్నాయి.

ఏం చేయాలన్న దానిపై…?

పార్టీలో ముందుగా తాము చేరామ‌ని, కృష్ణమోహ‌న్ వ‌ల్ల త‌ప్పులు జ‌రిగి ఉంటే.. ప‌క్కన పెట్టినా.. త‌న‌కు ఇవ్వాల‌ని, అంతే త‌ప్ప నిన్నగాక మొన్న వ‌చ్చిన వెంక‌టేష్‌కు ఎలా ఇస్తార‌ని ఆయ‌న ప్రతిపాదించార‌ట..‌! దీంతో వెంక‌టేష్‌కు ఇవ్వాలా? స్వాములు కోరుతున్నట్టు ఆయ‌న‌కు ఇస్తే.. ఏమైనా ప్రయోజ‌నం ఉంటుందా ? అనే మీమాంస ఏర్పడింది. అయితే, ఆమంచి వ‌ర్గానికి అనుకూలంగా ఉండే అధికారుల‌ను మాత్రం జిల్లా నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. దీనికి సంబంధించిన జీవో మాత్రం నేడో రేపో వ‌స్తుంద‌ని స‌మాచారం. అంటే.. దీనిని బ‌ట్టి.. ఆమంచి వ‌ర్గాన్ని ప‌క్కన పెట్ట‌డ‌మే కీల‌కంగా వైసీపీ భావిస్తోంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News