Amanchi : వీర విధేయ ఆమంచి… పట్టు బిగిస్తున్నారా?

రాజకీయాల్లో ఇద్దరు బలమైన నేతలు ఉన్నప్పుడు సహజంగానే హాట్ హాట్ గానే ఉంటాయి. పార్టీ అధినాయకత్వం కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలయని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు [more]

Update: 2021-10-18 02:00 GMT

రాజకీయాల్లో ఇద్దరు బలమైన నేతలు ఉన్నప్పుడు సహజంగానే హాట్ హాట్ గానే ఉంటాయి. పార్టీ అధినాయకత్వం కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలయని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ విషయంలోనూ వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు అదే డైలమాలో ఉంది. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరాంల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళుతున్నారు.

పర్చూరుకు పంపాలనుకున్నా….

కరణం బలరాం టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. కరణం బలరాం టీడీపీకి మద్దతు పలికాక ఆమంచిని పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా నియమించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేసింది. ఈ మేరకు ఆమంచి కృష్ణమోహన్ కు ప్రతిపాదన కూడా చేసింది. కానీ ఆయన అందుకు తిరస్కరించారు. తాను చీరాలలోనే రాజకీయాలు చేస్తానని తెగేసి చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల్లో….

మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి బీ ఫారాలు ఇవ్వకపోవడంతో పెద్ద రగడే అయింది. అయినా ఆమంచి తన వర్గాన్ని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపి పది మందిని గెలిపించుకున్నారు. వైసీపీ బీ ఫారం పైన పోటీ చేసిన వారికంటే ఎక్కువ ఓట్లను సాధించి ఆమంచి కృష్ణమోహన్ తన పట్టును నిలబెట్టుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుండటం, వైసీపీ ఇన్ ఛార్జి కావడంతో ఆమంచి వర్గమే చీరాలలో డామినేషన్ చేస్తుంది. తాము వైసీపీకి వీర విధేయులంటూనే పార్టీ కి ఇబ్బందులు కలగడకుండా తన వర్గాన్ని పెంచుకుంటూ పోతున్నారు.

వచ్చే ఎన్నికలకు….

దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ సిద్దమవుతున్నారు. తనకు టిక్కెట్ ఇస్తే సరి లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగేందుకు ఆయన ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్ వారీగా పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కరణం బలరాం ఉన్నప్పటికీ ప్రధాన సమస్యలను పరిష్కరించడంలోనూ, వ్యక్తిగతంగా క్యాడర్ ను కలుస్తూ ఆమంచి కృష్ణమోహన్ వచ్చే ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. మరి వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News