యాక్షన్ అంతా పండగ తర్వాతేనట

ఏపీలో రాజధాని కధ ఇపుడు హాట్ హాట్ గా ఉంది. సరిగ్గా ఇరవై రోజుల క్రితం జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ఒక ప్రకటన కారు చిచ్చులా [more]

Update: 2020-01-08 11:00 GMT

ఏపీలో రాజధాని కధ ఇపుడు హాట్ హాట్ గా ఉంది. సరిగ్గా ఇరవై రోజుల క్రితం జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన ఒక ప్రకటన కారు చిచ్చులా రాజుకుంది. నాటి నుంచి అమరావతి రైతులు రోడ్డు మీదకే వచ్చారు. అక్కడ ప్రతీ రోజూ ఆందోళనలు సాగుతున్నాయి. ఇక ఇపుడు సీన్లోకి సచివాలయ ఉద్యోగులు కూడా వస్తారని అంటున్నారు. మరో వైపు రాయల‌సీమలో కాక రగులుతోంది. అంతా కలసి సంక్రాంతి తరువాత అసలైన పండుగ చూపిస్తారట. అమరావతికే పరిమితమైన ఉద్యమాన్ని మొత్తం ఏపీకి తీసుకుపోతారట. మరో మారు జై ఆంధ్ర ఉద్యమాన్ని తలపించేలా గట్టిగానే ఈ ఆందోళన ఉంటుందని అంటున్నారు.

ఇక ప్రత్యక్షమే….

ఇక ప్రత్యక్ష ఆందోళనే అంటున్నారు అమరావతి పరిరక్షణ ఉద్యమకారులు. ఇంతవరకూ తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తూ వచ్చామని, అయితే తమ డిమాండ్లను ప్రభుత్వం అసలు పట్టించుకోవడంలేదని వారు అంటున్నారు. దాంతో ఉద్యమాన్ని మలి దశలో తీవ్రతరం చేస్తామని చెబుతున్నారు. దీనివల్ల ఏపీలోని మొత్తం ప్రజలను కూడా కలుపుకుని ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని కూడా అంటున్నారు. మరో వైపు కమిటీల మీద కమిటీలు వేస్తూ ప్రభుత్వం దూకుడుగా ముందుకుపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. తమను కాదని ఎక్కడికి వెళ్తారని కూడా అంటున్నారు.

సచివాలయ ఉద్యోగులు సై…..

ఇప్పటివరకూ అమరావతిలో సాగిన ఉద్యమం ఒక ఎత్తు. కేవలం రైతులు, కొన్ని వర్గాలు మాత్రమే పాత్ర పోషించాయి. ఇపుడు సచివాలయ ఉద్యోగులు కూడా రంగంలోకి దిగుతారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తాజా సమావేశం ఈ అనుమానాలను పెంచుతోంది. మొదట హైదరాబాద్ ని వదులుకుని అమరావతి వచ్చామని, ఇక్కడే ఇళ్ళు, వాకిళ్ళూ కొనుక్కుని స్థిరపడుతున్నామని, ఇపుడు విశాఖపట్నం అంటే ఎలా అని వారు ఆందోళన పడుతున్నారుట. అలాగే, తమ పిల్లలను హైదరాబాద్ లో చదివించుకుంటూ వారాంతంలో అక్కడికి వెళ్తున్నామని, ఇపుడు వైజాగ్ నుంచి ఆలా వెళ్ళడం అసాధ్యమని కూడా ఆవేదన చెందుతున్నారట. ప్రతీసారీ రాజధాని మార్పు అంటే తమకు ఇబ్బందేనని, నిజానికి రైతుల కంటే ఎక్కువ తామే నష్టపోతామని వారు మధనపడుతున్నారు. ఇప్పటివరకూ తమకు ఏ కమిటీ కూడా కలవలేదని, తమ అభిప్రాయాలను కనీసం తీసుకోలేదని వారు గుస్సా అవుతున్నారు. ఈ విషయంలో పండుగ తరువాత ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారుట.

రాయల‌సీమ కాక….

ఇక రాజధాని అమరావతిలో పెట్టడాన్ని తప్పుపడుతున్న రాయలసీమ నేతలు అది కాస్తా విశాఖపట్నం పోతుందంటే మాత్రం అసలు ఒప్పుకోవడంలేదు. ఉంటే రాయలసీమలో ఉండాలి. లేకపోతే ప్రత్యేక రాష్ట్రమైనా ఇవ్వాలన్న ధోరణిలో వారు ఇపుడు గొంతు సవరిస్తున్నారు. తమకు ఒక్క హై కోర్టు మాత్రమే చాలదని, ఏకంగా రాజధాని కావాలని, తమ త్యాగాలకు గుర్తింపు ఇవ్వాలని వారు అంటున్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ విషయంలో హై పవర్ కమిటీకి లేఖ రాసిన సీమ నేతలు రాజధానిని కర్నూల్లోనే పెట్టాలని అంటున్నారు. ఇక తమ యాక్షన్ ప్లాన్ ని పండుగ తరువాతే రాజకీయ తెరపైన చూడమంటున్నారు. మొత్తానికి అమరావతి నిరసన కాస్తా పండుగ తరువాత విశ్వరూపం దాల్చుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News