అమరావతి పై ఆసక్తి ఎందుకు తగ్గింది?
అమరావతి జేఏసీకి కి రెండు నెలల తరువాత తత్వం బోధపడింది. రాజధాని ప్రాంతంలో తప్ప 13 జిల్లాల్లో ప్రజల నుంచి మద్దతు తమకు లేదనే లెక్కల్లోకి జేఏసీ [more]
అమరావతి జేఏసీకి కి రెండు నెలల తరువాత తత్వం బోధపడింది. రాజధాని ప్రాంతంలో తప్ప 13 జిల్లాల్లో ప్రజల నుంచి మద్దతు తమకు లేదనే లెక్కల్లోకి జేఏసీ [more]
అమరావతి జేఏసీకి కి రెండు నెలల తరువాత తత్వం బోధపడింది. రాజధాని ప్రాంతంలో తప్ప 13 జిల్లాల్లో ప్రజల నుంచి మద్దతు తమకు లేదనే లెక్కల్లోకి జేఏసీ వచ్చినట్లు తాజాగా వారి సమీక్షే చెప్పక చెప్పేసింది. దీన్ని గుర్తించే అన్ని జిల్లాల్లో పోరాటం చేసే దిశగా జెఎసి లు రంగంలోకి దిగాలని అమరావతి జెఎసి తీర్మానం చేయడం వెనుక రీజన్ ఇదే అంటున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై ప్రజల్లో సానుభూతి వున్నా ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఎక్కువమంది నమ్మడంతో విపక్షాల ఉద్యమానికి టిడిపి మీడియా లో తప్ప ప్రచారం లభించడం లేదు. అలాగే ఒక్క అడుగు కూడా ఉద్యమం లో ఫలితం కనిపించకపోవడంతో కొత్త వ్యూహానికి జెఎసి కసరత్తు మొదలు పెట్టింది.
బాబు టూర్ తో మారిన వైఖరి …
చంద్రబాబు విశాఖ టూర్ రసాభాసాగా మారడంతో జెఎసి కార్యాచరణలో మార్పు చేర్పులకు సిద్ధమైంది. ప్రజల నుంచి నేరుగా మద్దత్తు లభిస్తే అధికారపక్షం అణచివేతను ఎదిరించవచ్చని భావించింది. వెంటనే అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించేసింది. ఇతర జిల్లాల్లో ప్రజల మద్దత్తు సమీకరణకు ఏమి చేయాలన్న ఆలోచనతో ఈ సమీక్ష మొత్తం సాగింది. కేవలం రాజధాని ప్రాంతం వరకే ఉద్యమం పరిమితమైతే లాభం లేదనుకుంది.
ఆర్థికంగా భారం కావడంతో…
అమరావతిలోనే రాజధాని ఉండాలి అన్న డిమాండ్ కి మద్దతుగా అన్ని జిల్లాలలో టిడిపి సూత్రధారిగా ఉండి ఎక్కడికక్కడ జేఏసీ లు ఏర్పాటు చేయించింది. అయితే ఈ జెఎసిలు కొద్ది రోజులు కార్యక్రమాలు చేసి మిన్నకుండిపోయాయి. ప్రజల్లో ఈ ఉద్యమాలపై నిర్లిప్త వైఖరి కనిపించడంతో బాటు కార్యక్రమాలు చేయడానికి ఆర్ధికంగా భారం కావడం కూడా జోరు తగ్గడానికి రీజన్ అయ్యింది. వీటిని గుర్తించిన అమరావతి జెఎసి మరోసారి అన్ని జిల్లాల్లోని జెఎసి లకు మరోసారి ఊపిరి పోసేందుకు సిద్ధం అయినా వారు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.