ఇప్పటి నుంచే సింగ్ మొదలుపెట్టేశారా?
పంజాబ్ ఎన్నికలకు అన్ని పార్టీలూ దాదాపు సిద్ధమయ్యాయి. వేధింపులు కూడా మొదలయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుమారుడికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పంజాబ్ ఎన్నికలకు [more]
పంజాబ్ ఎన్నికలకు అన్ని పార్టీలూ దాదాపు సిద్ధమయ్యాయి. వేధింపులు కూడా మొదలయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుమారుడికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పంజాబ్ ఎన్నికలకు [more]
పంజాబ్ ఎన్నికలకు అన్ని పార్టీలూ దాదాపు సిద్ధమయ్యాయి. వేధింపులు కూడా మొదలయ్యాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుమారుడికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పంజాబ్ ఎన్నికలకు మరో పదిహేను నెలలు సమయం ఉన్నప్పటికీ మరోసారి పార్టీని విజయపథాన నడిపేందుకు అమరీందర్ సింగ్ రెడీ అవుతున్నారు. 2017 లో జరిగిన ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడపటంలో అమరీందర్ పాత్ర ఎంతో ఉందని చెప్పక తప్పదు. ప్రస్తుతం కాంగ్రెస్ సొంతంగా ఉన్న రెండు రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి.
మహారాజా కుటుంబం నుంచి…..
పాటియాలా మహారాజా కుటుంబం నుంచి వచ్చిన అమరీందర్ సింగ్ తొలి నుంచి కాంగ్రెస్ వాదే. మధ్యలో అకాలీదళ్ కు వెళ్లివచ్చినా ఆయన పార్టీలో స్ట్రాంగ్ పర్సన్. ఎటువంటి మచ్చలేని నేత. ఆర్మీలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన అమరీందర్ రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయనను ముఖ్యమంత్రి పీఠం వరించిందంటారు. సిక్కుల్లో జాట్ వర్గానికి చెందిన అమరీందర్ పంజాబ్ ను విజయపథాన నడపటంలో సక్సెస్ అయ్యారు.
పదిహేను నెలలు ఉన్నా….
పంజాబ్ శాసనసభ ఎన్నికలు ఇంకా పదిహేను నెలలు ఉన్నా ఇప్పటి నుంచే అమరీందర్ పనిని మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో మూడు బిల్లులను తెచ్చారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్ అంతటా నిరసన ర్యాలీలు నిర్వహించారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయి విజయం సాధించడంతో గ్రామ స్థాయిలో రైతు ఉద్యమాన్ని నిర్వహించాలని అమరీందర్ చూస్తున్నారు.
పర్యటనలను ప్లాన్ చేసుకుని….
అమరీందర్ ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పీకే టీం రంగంలోకి దిగి నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తుంది. పార్టీ అధిష్టానానికి విధేయుడిగా ఉంటూనే అభ్యర్థుల ఎంపిక విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన రాహుల్ ను కోరినట్లు తెలిసింది. ఎన్డీఏ నుంచి అకాలీదళ్ కూడా బయటకు పోవడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో అమరీందర్ ఉన్నారు. ఇప్పటి నుంచే అన్ని నియోజకవర్గాలు పర్యటించేందుకు అమరీందర్ ప్లాన్ చేసుకుంటున్నారు.