Punjab : కెప్టెన్ టార్గెట్ రీచ్ అవుతారా?

పంజాబ్ లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చే లక్ష్యంగా అమరీందర్ కొత్త పార్టీ ని స్థాపించబోతున్నారు. ఆయన టార్గెట్ [more]

Update: 2021-10-22 16:30 GMT

పంజాబ్ లో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చే లక్ష్యంగా అమరీందర్ కొత్త పార్టీ ని స్థాపించబోతున్నారు. ఆయన టార్గెట్ ను కాంగ్రెను ఓడించడమే. కాంగ్రెస్ కన్నా పీసీసీ చీఫ్ సిద్ధూను రాజకీయాల్లో లేకుండా చేయడమే అమరీందర్ లక్ష్యంగా కన్పిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న పళంగా తనను తప్పించడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీ అధినాయకత్వం పైన చేసే విమర్శలకన్నా అమరీందర్ సిద్దూనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా తప్పించడంతో….

అమరీందర్ సింగ్ వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తన నాయకత్వంలోనే పార్టీని మరోసారి గెలిపించాలని ఆయన సిద్ధమయ్యారు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. రైతులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో ఆయన రైతు నిరసనలకు మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి ట్రాక్టర్ ర్యాలీని కూడా నిర్వహించారు.

కొత్త పార్టీతో….

కానీ ఉన్నట్లుండి అమరీందర్ సింగ్ ను కాంగ్రెస్ నాయకత్వం మార్చింది. సిద్దూ వల్లనే తన పదవి పోయిందని, తన ఆశలు గల్లంతయ్యాయని అమరీందర్ అభిప్రాయపడుతున్నారు. అందుకే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమయ్యారు. నిజానికి ఆయన బీజేపీలో చేరతారని భావించినా ఆ ఆలోచనను విరమించుకున్నారు. మోదీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనపై కూడా పడుతుందని, అది కాంగ్రెస్ కు అడ్వాంటేజీగా మారుతుందని భావించి సొంత పార్టీ పెట్టనున్నారు.

ఎవరికి నష్టం?

అమరీందర్ పార్టీ పెట్టడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఆయన పార్టీ పెట్టి భంగపడ్డారు. చివరకు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. అయితే కొత్త పార్టీ తో అమరీందర్ ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది చెప్పలేం కాని, బీజేపీని గెలిపించడం కన్నా కాంగ్రెస్ ను ఓడించడంలో అమరీందర్ కొత్త పార్టీ ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మధ్యలో ఆమ్ ఆద్మీపార్టీ, అకాలీదళ్ లు లబ్దిపొందే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News