Amarinder singh : అమరీందర్ తో అలా ఆడిస్తారట
కాంగ్రెస్ పంజాబ్ ఎన్నికల వేళ మరో కీలక నేతను దూరం చేసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారు. ఆయన బీజేపీలో [more]
కాంగ్రెస్ పంజాబ్ ఎన్నికల వేళ మరో కీలక నేతను దూరం చేసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారు. ఆయన బీజేపీలో [more]
కాంగ్రెస్ పంజాబ్ ఎన్నికల వేళ మరో కీలక నేతను దూరం చేసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారు. ఆయన బీజేపీలో చేరిక ఖాయమైంది. అమరీందర్ ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు చర్చించారు. తన రాజకీయ భవిష‌్యత్ పై కెప్టెన్ అమరీందర్ ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఆయన స్వయంగా ప్రకటన చేయనున్నారని తెలిసింది.
పూర్తికాలం లెక్కే….
దాదాపు నాలుగేళ్లు అమరీందర్ సింగ్ ను కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగించింది. మరో నెలలు మాత్రమే గడువు ఉండగా కఠినంగా పీకి పారేసింది. దీంతో అమరీందర్ సింగ్ కు జరిగిన నష్టం కంటే కాంగ్రెస్ కే పంజాబ్ రాజకీయాల్లో ఎక్కువ నష‌్టం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. పంజాబ్ లో కాంగ్రెస్ కు ఈసారి కూడా ఎడ్జ్ ఉంది. రైతులు బీజేపీకి వ్యతిరేకంగా ఉండటంతో పాటు
అకాలీదళ్ బీజేపీ నుంచి విడిపోవడం కాంగ్రెస్ కు కలసి వచ్చే అంశంగా చూడాలి.
బీజేపీికి దగ్గరగా….
అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అమరీందర్ సింగ్ బీజేపీకి దగ్గరవుతున్నారు. ఆయన నేరుగా బీజేపీలో చేరకపోవచ్చు. పంజాబ్ లో త్వరలో అమరీందర్ సింగ్ నేతృత్వంలో కొత్త పార్ట ఆవిర్భించబోతుంది. ఈ పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటుంది. అమరీందర్ సింగ్, అమిత్ షా ల మధ్య భేటీలో కొత్త పార్టీ వ్యవహారంపైనే కీలకంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రధానంగా కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు గేమ్ ప్లాన్ పై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.
కొత్త పార్టీ పెట్టి…..
అమరీందర్ సింగ్ కొత్త పార్టీ గతంలోనూ పెట్టారు. అయితే పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత దానిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు మరో కొత్త పేరుతో అమరీందర్ పంజాబ్ లో పార్టీ పెట్బోతున్నారు. ఈ పార్టీ గుర్తు మీద ఆయనకు బలం ఉన్న చోట, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట అభ్యర్థులను నిలబెడతారని చెబుతున్నారు. అలాగే అమరీందర్ కు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది.