ఇద్దరికీ దిమ్మ తిరిగిపోయిందిగా?

అమెరికా, రష్యా అగ్రరాజ్యాలు. ఆర్ధికంగా అత్యంత శక్తిమంతమైనవి. ఆయుధపరంగా తిరుగులేని దేశాలు. ఈ బలంతోనే ప్రపంచ పరిస్ధితులను శాసించేవి. అంతర్జాతీయంగా ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా ఆ ఘటన [more]

Update: 2020-05-26 16:30 GMT

అమెరికా, రష్యా అగ్రరాజ్యాలు. ఆర్ధికంగా అత్యంత శక్తిమంతమైనవి. ఆయుధపరంగా తిరుగులేని దేశాలు. ఈ బలంతోనే ప్రపంచ పరిస్ధితులను శాసించేవి. అంతర్జాతీయంగా ఎక్కడ చీమ చిట్టుక్కుమన్నా ఆ ఘటన వెనుక వాటి ప్రమేయం ఉండేది. కొన్ని సందర్బాల్లో ప్రత్యక్ష, మరికొన్ని సందర్భాల్లో అగ్రదేశాల పరోక్ష ప్రమేయం ఉండేది. అందుకే ఆ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచేది. రెండు అగ్ర దేశాలను ముఖ్యంగా అమెరికాను చుాసి అంతర్జాతీయ సమాజం ఒకింత భయంతో ఉండేది. ముఖ్యంగా వర్ధమాన దేశాలు వణికిపోయేవి. వాటి ఆగ్రహానికి గురైతే ఎక్కడ తమ ఉనికిని ముప్పు వస్తుందోనని ఆందోళన చెందేవి. ఇది చరిత్ర. వర్తమాన పరిస్ధితి విభిన్నంగా ఉంది.

వణికిపోతున్నా…..

ముాడక్షరాల కరోనా మ‍హమ్మారికి ఈ అగ్రదేశాలు వణికిపోతున్నాయి. దాని ప్రభావానికి బెంబేలెత్తుతున్నాయి. రోజురోజుకు వెలుగుచుాస్తున్న కరోనా పాజిటివ్ కేసులు, నమెాదవుతున్న మరణాలు ఈ రెండు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటుకేసులు, ఇటు మరణాల్లో అమెరికా ముందజలో ఉంది. మే 17 నాటికి దేశవ్యాప్తంగా 15,15,311 కరోనా కేసులు నమోదు కాగా, 90,332 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా అటుకే సులు, ఇటు మరణాల్లో అమెరికా ముందంజలో ఉందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచుాచిన కేసులు మే 17 నాటికి 47,71,697 కాగా వాటిలో సింభ భాగం అమెరికావే కావడం గమనార్హం. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా మే 17 నాటికి 3,14,684 మంది చనిపోగా ఒక్క అగ్రరాజ్యంలోనే 90,332 మంది చనిపోవడం కరోనా తీవ్రతను కళ్ళకు కడుతోంది.

ట్రంప్ తీరే అంత….

అయినా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు అందరినీ ఆశ్యర్య పరుస్తోంది. కనీసం మాస్క్ నుదరించడానికి కుాడా ఆయన ఇష్టపడటం లేదు మెుదటినుంచీ కరోనా ను తీవ్రంగా తీసుకోలేదు. తమకు లాక్ డౌన్ కన్నా ఆర్ధిక వ్యవస్ధ ముఖ్యమని బహిరంగంగా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి కొలువైన అంతర్జాతీయ నగరం న్యూయార్క్ శవాల దిబ్బగా మారినా ఆయన వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం. న్యూయార్క్ లో కనీసం మృతదేహాలను ఖననం చేసే పరిస్ధితి కుాడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నియంత్రణలో లేనందున ఇప్పుడే పాఠశాలలను ప్రారంభించవద్దన్న అంటువ్యాధుల నిపుణుడు ఆందోనీ ఫాబీ సలహాను అధ్యక్షుడు ట్రంప్ పెడచెవిన పెట్టారు. వీలైనంత త్వరగా పాఠశాలలను ప్రారంభించాలని ఆయన అన్ని రాష్ట్రాల గవర్నర్లకు పిలుపిచ్చారు. టెక్సాస్, జార్జియా తదితర రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు ఆశించిమేరకు జరగడం లేదు. మెక్సికో సరిహద్దుల్లో టెక్సాస్ ఉంటుంది. మెక్సికో నుంచి ఈ రాష్ట్రంలోకి నిత్యం భారీగా వలసలు జరుగుతుంటాయి. కరోనాపై పోరాటం కోసం ఏర్పాటైన శ్వేతసౌధంలో టాస్క్ ఫోర్స్ సభ్యులు ముగ్గురు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళారు. కరోనా సోకిన వ్యక్తితో కలసి పనిచేసినందుకు వీరు ఈ నిర్భయం తీసుకున్నారు. అలర్జీ, అంటువ్యాదుల నివారణకు జాతీయ సంస్ధ డైరెక్టర్ ఆందోనీ ఫాబీ, వ్యాధినియంత్రణ నిదారణ కేంద్రాల డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫిడ్, ఆహార ఒౌషద, పరిపాలన విభాగం కమీషనర్ స్టీఫెన్ హాన్ స్వీయ నిర్భంధంలోకి వెళ్ళారు. అధ్యక్ష్య భవనం శ్వేతసౌధంలోని అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక వ్యక్తిగత బృందంలోని సభ్యులకు కుాడా కరోనా సోకింది.

రష్యాలో కూడా అంతే…

మరో అగ్రదేశమైన రష్యాను కరోనా అతలాకుతలం చేస్తోంది. మెుదట్లో ఈ దేశంలో కరోనా ఆనవాళ్ళు కనబడలేదు. కానీ తరువాత ఒక్కసారిగా చుట్టుముట్టింది. కరోనా వెలుగు చుాసిన చైనాతోె ఈ దేశం సరిహద్దును పంచుకుంటోంది. అయితే కేసులు ఎక్కువ ఉన్నప్పటికీ మరణాలు తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. ఈ నెల 17 నాటికి 2,81,752 కేసులు వెలుగు చుాడగా 2,631 మంది మరణించారు ఒక్క మే 17 నే 9,709 కేసులు నమెాదుకావడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా తర్వాత అత్యధికంగా కేసులు నమెాదైంది ఇక్కడే కావడం గమనార్హం. స్వయంగా ఆ దేశ ప్రధాని మిస్తిసిషి, మరోఇద్దరు మంత్రులు పాజిటివ్ గా తేలాయి. అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెఫ్కోవ్ పాజిటివ్ గా తేలారు. దేశవ్యాప్తంగా వెలుగు చుాసిన కేసుల్లో సగానికి పైగా రాజధాని మాస్కోలోనే కావడం గమనార్హం. మాస్కో తర్వాత రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్ బర్గ్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయినప్పటికి లాక్ డౌన్ ను అధ్యక్షడు పుతిన్ ఎత్తవేయడం గమనార్హం. నిర్దిష్ట జాగ్రత్తలు పాటిస్తునే కరోనాను ఎదుర్కోవాలన్నది ఆయన వ్యూహం. ప్రపంచదేశాలు కుాడా ఈ దిశగానే ఆలోచిస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News