ప్రెసిడెంట్ ను డిసైడ్ చేసేది మనోళ్లేనట
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. [more]
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. [more]
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నవంబరు లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే భారతీయ అమెరికన్ల ఓటర్లపైనే రెండు పార్టీలూ ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కన్పిస్తున్నాయి. దాదాపు 20 లక్షల మంది భారతీయ ఓటర్లు ఉండటంతో వీరి ఓట్లపైనే ఎవరు గెలుస్తారన్నది ఆధారపడి ఉంది. దీంతో భారతీయ అమెరికన్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఆకట్టుకునేందుకు ట్రంప్…..
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికన్ల ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ఉన్న వీడియోలతో ఒక యాడ్ ను ట్రంప్ ప్రచార బృందం రూపొందించింది. ట్రంప్ భారత్ పర్యటనపై కూడా వీడియోను రూపొందించి ప్రచారం చేస్తున్నారు. భారత్ సత్సంబంధాలను కొనసాగించాలంటే తనకే కే ఓటు వేయాలని భారతీయ అమెరికన్లకు ట్రంప్ విజ్ఞప్తి చేస్తున్నారు.
బిడెన్ సయితం…
మరోవైపు డెమొక్రాట్ అభ్యర్థి జోబిడెన్ కూడా భారతీయ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. తాను భారత్ తో సత్సంబంధాలను కొనసాగిస్తానని పదే పదే చెబుతున్నారు. దీనికి తోడు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హారిస్ కూడా భారతీయ సంతతికి చెందిన వారు కావడంతో భారతీయ అమెరికన్లు తమకే మద్దతుగా ఉంటారని డెమొక్రాట్లు భావిస్తున్నారు. సంప్రదాయంగా భారతీయ అమెరికన్లు డెమొక్రాట్ల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు. గత ఎన్నికల్లో మాత్రం ట్రంప్ వైపు నిలబడ్డారు. అందుకే గత ఎన్నికల్లో ట్రంప్ గెలుపు సాధ్యమయింది.
ఇక్కడే ఎక్కువగా…..
భారతీయ అమెరికన్లు ఎక్కువగా అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్ రాష్ట్రాలలో ఉన్నారు. దాదాపు పదమూడు లక్షలమ మంది ఈ రాష్ట్రాల్లోనే ఉన్నారు. దీంతో ఇక్కడే ఎక్కువగా ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పెన్సిల్వేనియా రాష్ట్రం 42000 ఓట్ల ఆధిక్యం ఇవ్వడంతో ట్రంప్ గెలలిచారు. ఇక్కడే అత్యధికంగా భారతీయ అమెరికన్లు ఉన్నారు. అందుకోసమే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలన్నీ భారతీయ అమెరికన్ల ఓటర్ల ను ఆకట్టుకోసం పోటీ పడుతున్నారు. ఇబ్బడ ముబ్బడిగా హామీలు గుప్పిస్తున్నారు.