షా….నెంబర్ 2…ఎలా అయ్యారు…??
అమిత్ అనిల్ చంద్ర షా.. ఈ పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ అమిత్ షా అంటే అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన [more]
అమిత్ అనిల్ చంద్ర షా.. ఈ పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ అమిత్ షా అంటే అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన [more]
అమిత్ అనిల్ చంద్ర షా.. ఈ పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. కానీ అమిత్ షా అంటే అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో ప్రధాని తర్వాత అత్యంత కీలకమైన నేత అయిన అమిత్ షా పూర్తి పేరు అనల్ అమిత్ చంద్ర షా. అయిదేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితుడ య్యేంత వరకూ అమిత్ షా పేరు ఎవరికీ తెలియదు. అప్పటికి ఆయన గుజరాత్ కే పరిమితమైన నాయకుడు. ఢిల్లీ రాజకీయాలంటే ఏవిటో సరిగా తెలియదు కూడా. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత తన అనుంగు అనుచరుడు, నమ్మకమైన నేస్తం అమిత్ షా ను కమలం పార్టీ అధినేతగా నియమించడంతో ఒక్కసారికగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయనకు ఎదురులేకుండా పోయింది. సాధారణంగా ఢిల్లీ గద్దె నెక్కిన పార్టీ వ్యవహారాలన్నీ ప్రధాని కనుసన్నల్లోనే సాగుతుంటాయి. కానీ పాలనకే పరిమితమైన మోదీ పార్టీ వ్యవహార బాధ్యతలను పూర్తిగా అమిత్ షాకు అప్పగించారు. ఏదైనా అంతిమ నిర్ణయం కోసమ ప్రధానిని సంప్రదించడం తప్ప సాధారణంగా పార్టీ వ్యవహారాలను అమిత్ షానే చక్కబెట్టేవారు.
నమ్మకాన్ని నిలబెట్టి…..
తన నేస్తం మోదీ నమ్మకాన్ని నిలబెట్టారు అమిత్ షా. గత ఐదేళ్లలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్, హర్యానా, అసోం, గోవా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, ఉత్తరాఖండ్, కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పతాకం రెపరెపలాడటానికి అమిత్ షాచేసిన కృషి అనన్య సామాన్యం. పంజాబ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో పార్టీ ఓడిపోయినప్పటికీ గౌరవప్రదమైన సీట్లను సాధించింది కమలం పార్టీ. ఇక ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత షా శక్తి సామర్థ్యాలు, సత్తా అందరికీ స్పష్టంగా తెలిశాయి. దీంతో ఇప్పటివరకూ పార్టీకి పరిమితమైన షా సేవలను ప్రభుత్వంల్ో కూడా ఉపయోగించాలనుకున్న మోదీ కీలకమైన హోం మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. కేంద్రంలో ప్రధాని తర్వాత రెండోస్థానం హోంమంత్రిదేనన్న్న సంగతి రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిందే. వివిధ రాష్ట్రాల గవర్నర్లు సయితం ఢిల్లీ వచ్చినప్పుడు హోంమంత్రిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. షా పరిధిని కేవలం హోంమంత్రికే పరిమితం చేయలేదు మోదీ. పాలనకు సంబంధించిన మొత్తం ఎనిమిది కమిటీల్లో ఆయనకు స్థానం కల్పించారు. వసతి ఏర్పాటు సారథ్య కమిటీ బాధ్యతలను కడా ఆయనకే అప్పగించారు. మొత్తం 8 కమిటీల్లో ఆయనకు స్థానం కల్పించాగా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ ను ఏడు, రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ కు 6 కమిటీల్లో స్థానం కల్పించారు. దీనిని బట్టి షా ప్రాధాన్యం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన సత్తా అందరికీ అర్థమయింది.
ఇతర శాఖల మంత్రులు కూడా…..
ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, నియామకాలు, భద్రతా వ్యవహరాలు, పెట్టుబడులు,, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ది కమిటీల్లో షా సభ్యుడు. వసతి ఏర్పాటు కమిటీకి షా స్వయంగా సారధి కావడం గమనార్హం. తాజాగా ఇటీవల నార్త్ బ్లాక్ లో షా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆర్థిక, విదేశాంగ, పెట్రోలియం మంత్రులు నిర్మల సీతారామన్, జయశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ హాజరయ్యారు. కొద్దిసేపటికి నీతి ఆయోగ్ సీఈవోను పిలిపించారు. మరికొద్దిసేపటికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీల అధిపతులు వచ్చారు. ఒక మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఇతర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారంటే ఆయన ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆశీస్సులు లేకుండానే ఇదంతా జరగదు. వైసీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన వైఎస్ జగన్ వెంటనే ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో అత్యంత కీలకమైన, రెండో అధికార కేంద్రమైన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలసినట్లు వెల్లడించారు. అమిత్ షా ప్రాధాన్యత ఏమిటో ఇంతకన్నా స్పష్టంగా చెప్పలేరు మరి.
-ఎడిటోరియల్ డెస్క్