భాషా…ఎంత చెప్పినా వినడం లేదే?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధాన [more]
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధాన [more]
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయన మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధాన మీడియాలో కూడా వార్తలు రావడంతో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా అలెర్ట్ అయ్యారు. తాను మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లకపోయినా కొన్ని వార్తా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అంజాద్ భాషా ఆరోపిస్తున్నారు.
మంత్రివర్గ సమావేశానికి కూడా….
అంజాద్ భాషా ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశానికి కూడా హాజరయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్ చేస్తున్నారు. సాక్షాత్తూ మంత్రి తాను మర్కజ్ వెళ్లి వచ్చిన విషయాన్ని దాచిపెడుతున్నారని అంజాద్ భాషాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం కూడా ఆరా తీసింది. అంజాద్ భాషా ఢిల్లీ వెళ్లిన విషయం వాస్తవమేనని, అయితే ఆయన మర్కజ్ ప్రార్థనలకు ముందే ఢిల్లీ వెళ్లి వచ్చారని ప్రభుత్వ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.
తాను వెళ్లలేదని…
అయితే అంజాద్ భాషా తాను ఢిల్లీకి వెళ్లిన మాట వాస్తవమేనని, మార్చి 5 వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ కడపలోనే ఉన్నానని చెబుతున్నారు. నిజానికి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన కదలికలన్నీ రికార్డయి ఉంటాయి. టూర్ షెడ్యూల్ కూడా తయారయి ఉంటుంది. కానీ కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని అంజాద్ భాషాపై తప్పుడు ప్రచారం చేస్తుండటంతో కడపలో ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం సీరియస్……
దీంతో అంజాద్ భాషా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాన మర్కజ్ ప్రార్థనలకు హాజరయనట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని హెచ్చరించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు, ఛానళ్లపై పరువు నష్టం దావా వేయనున్నట్లు అంజాద్ భాషా ప్రకటించారు. మొత్తం మీద మొన్న గుంటూరు ఎమ్మెల్యేల ముస్తాఫాపైన ఇలాగే ప్రచారం జరిగింది. తాజాగా అంజాద్ భాషాపై తప్పుడు ప్రచారం చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.