Amaravathi : వీరిని కూడా వదిలేసినట్లేనా?

తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఇప్పుడు ముఖ్యం అమరావతి కాదు. ముందుగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు జగన్ ప్రభుత్వంపై ఆందోళనలు చేయడమే. కానీ దాదాపు 700 రోజులుగా [more]

Update: 2021-10-24 00:30 GMT

తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ఇప్పుడు ముఖ్యం అమరావతి కాదు. ముందుగా పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు జగన్ ప్రభుత్వంపై ఆందోళనలు చేయడమే. కానీ దాదాపు 700 రోజులుగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులను మాత్రం టీడీపీ ఇతర పక్షాలు గాలికి వదిలేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ శాసనసభలో మూడు రాజధానులు ప్రకటన చేశాక అమరావతిలో రైతులు ఆందోళనకు దిగారు.

ఇన్ని రోజులు గడుస్తున్నా…..

అప్పటి నుంచి అమరావతి రైతులు రోజూ ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు వంటి వారు కూడా అక్కడకు వెళ్లి సంఘీభావం తెలిపారు. రైతులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టడానికి ప్లాన్ చేశారు. అయితే కోవిడ్ నిబంధనలు అమలులో ఉండటంతో నిలిపివేశారు. చంద్రబాబు అమరావతి ఉద్యమం కోసం జోలె కూడా పట్టారు. నారా భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ఉద్యమానికి ఇచ్చారు.

కొద్ది నెలలుగా….

అయితే గత కొద్ది నెలలుగా టీడీపీ అమరావతి రైతులను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఉండవల్లిలోని కరకట్ట మీదనే ఉంటున్నా కనీసం వారిని పిలిపించుకుని కార్యాచరణ గురించి చర్చించలేదు. న్యాయస్థానంలో ఈ అంశం నలుగుతుండటంతో దానిని పూర్తిగా వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు చేపట్టిన పార్టీ నియామకాలు కూడా విమర్శలకు తావిచ్చాయి.

ఎన్నికల మూడ్ లోకి…..

అమరావతి రైతులు ఇప్పుడు ఒంటరి అయ్యారు. అన్ని రాజకీయ పక్షాలు ఏపీలో ఇప్పుడు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. దీంతో వారిని, వారి ఆందోళనను ఎవరూ పట్టించుకోవడం లేదు. వారి వద్దకు వెళ్లి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ డిమాండ్ ను పెద్దగా టీడీపీ విన్పించే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు.

Tags:    

Similar News