ఆ ఎమ్మెల్యే జంప్ గ్యారెంటీ .. బాబు ఫోన్ కు కూడా టచ్ లో లేరట
టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో.. ఎంత మంది జంప్ అవుతారో ? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం మహానాడు ప్రారంభమైన నేపథ్యంలో [more]
టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో.. ఎంత మంది జంప్ అవుతారో ? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం మహానాడు ప్రారంభమైన నేపథ్యంలో [more]
టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో.. ఎంత మంది జంప్ అవుతారో ? అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం మహానాడు ప్రారంభమైన నేపథ్యంలో ఈ చర్చ జోరు మరింత పెరిగింది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వంటి వారు పార్టీ వీడి.. వైసీపీకి మద్దతు పలికారు. ఇక, ఇప్పుడు మరో ముగ్గురు లైన్‌లో ఉన్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. టీడీపీకి అత్యంత అనుకూలంగా ఉండే మీడియా ఛానెల్స్‌లోనే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పేపర్లలో కథనాలు బలంగా వస్తున్నాయి. ఇక ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెపుతారని వార్తలు వస్తోన్న వారిలో ప్రకాశం జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్, ఇక ప్రకాశం జిల్లాకే చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిలు సైకిల్ దిగి.. జగన్ చెంతకు చేరిపోతారనే ప్రచారం ఉంది.
బుజ్జగించే పనిలో…..
దీంతో రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు.. నేతలను బుజ్జగించే పనిచేపట్టారు. అయితే, వీరిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి, ఏలూరి మొత్తబడే ఛాన్స్ ఉన్నా గుంటూరు జిల్లా రేపల్లె నుంచి వరుస విజయాలు సాధించిన అనగాని విషయంలో మాత్రం బాబు ప్రయత్నాలు ఫెయిలవు తున్నాయని అంటున్నారు. పార్టీ మహానాడు ప్రారంభించిన నేపథ్యంలో అనగానిలో జోష్ ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలో ఉన్నట్టుగానే ఉన్నా.. మనసు మాత్రం ఆయనకు జగన్ దగ్గరే ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యలో అనగాని పార్టీ మారతారన్న వార్తలు వచ్చినప్పుడు చంద్రబాబు ఫోన్ చేస్తేనే ఆయన స్పందించలేదన్న టాక్ కూడా బయటకు వచ్చింది.
మోపిదేవి రాజ్యసభకు వెళితే…..
పైగా జగన్ కూడా అనగాని సత్యప్రసాద్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేపల్లె నుంచి వైసీపీ నాయకుడిగా ఉన్న మోపిదేవి త్వరలోనే రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకుడుగా ఉన్న అనగానిని వైసీపీ వైపు తిప్పుకోగలిగితే.. వైసీపీలో జోష్ పెరుగుతుందనే భావన ఉంది. మోపిదేవి రాజ్యసభకు వెళితే ఆ స్థానాన్ని అదే బీసీ నేతగా, రెండుసార్లు గెలుస్తూ రేపల్లెలో పట్టు ఉన్న అనగాని సత్యప్రసాద్ తో భర్తీ చేయాలన్నదే వైసీపీ ప్లాన్‌గా తెలుస్తోంది.
బాబుకు దొరకకుండా…?
ఈ నేపథ్యంలో వైసీపీ అగ్ర నాయకత్వం ఇప్పటికే రెండు దఫాలుగా అనగాని సత్యప్రసాద్తో చర్చించారు. ఈ క్రమంలోనే అనగాని కూడా టీడీపీకి దూరమవుతు న్నారు. గతంలో జిల్లా నాయకుల ఫోన్లకు స్పందించని అనగాని సత్యప్రసాద్ ఆ తర్వాత చంద్రబాబు ఫోన్ చేసినా.. అనగాని లిఫ్ట్ చేయని విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా పార్టీ కి దూరంగా ఉన్న అనగాని ఖచ్చితంగా పార్టీ మారడం ఖాయమనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.