అనగాని ఆఖరి నిమిషంలో ఛేంజ్.. కారణం ఇదే?

చివరి నిమిషంలో ఆయన వైసీపీలో వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు. లేకపోతే ఈపాటికి వైసీపీ కండువా కప్పేసుకునే వారు. కానీ ఆఖరు క్షణంలో ఏం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా [more]

Update: 2020-07-14 15:30 GMT

చివరి నిమిషంలో ఆయన వైసీపీలో వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు. లేకపోతే ఈపాటికి వైసీపీ కండువా కప్పేసుకునే వారు. కానీ ఆఖరు క్షణంలో ఏం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకున్నారు. అందుకు అంతా రంగం సిద్ధమయింది. వైసీపీ అధిష్టానం సయితం ఆయనకు పూర్తి స్థాయి హామీ ఇచ్చింది. అయినా వైసీపీలో అనగాని సత్యప్రసాద్ చేరకపోవడానికి కారణాలపై ఇప్పుడు లోతుగా చర్చ జరుగుతోంది.

వరసగా గెలిచి…..

అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికలలో ఆయన వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకట రమణపై విజయం సాధించారు. మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు వెళ్లడంతో ఆయన అధికార పార్టీలోకి వచ్చేందుకు సిద్దమయ్యారు. నియోజకవర్గంలో ఏ పని జరగక పోవడంతో పార్టీ మారడమే మంచిదన్న నిర్ణయానికి అనగాని సత్యప్రసాద్ వచ్చారు.

వైసీపీ నేతలతో మంతనాలు….

ఈ మేరకు వైసీపీ నేతలతో మంతనాలు జరిపారు. అనగాని సత్యప్రసాద్ కు తెలంగాణ రాజకీయ నేతలతో సత్సంబంధాలున్నాయి. ఆయనకు వారితో వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. వారి వల్లనే అనగాని సత్యప్రసాద్ వైసీపీ అధినాయకత్వంతో టచ్ లోకి వెళ్లారు. కొన్ని డిమాండ్లను కూడా అనగాని సత్యప్రసాద్ వైసీపీ అధిష్టానం ముందు పెట్టారు. అందులో కొన్నింటిని అంగీకరించారు. అయితే ఆయనకు మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాధ్ అడ్డంకిగా మారారు.

టీడీపీ సేఫ్ అనుకుని…..

రేపల్లె రాజకీయాల్లో భవిష్యత్తులో మోపిదేవి హరనాధ్ తనకు అడ్డంకిగా మారతారని అనగాని సత్యప్రసాద్ భావించారు. జగన్ కు కూడా మోపిదేవి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారన్నది ఆయనకు తెలియంది కాదు. దీంతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి వైదొలగడంతో ఫ్యూచర్ లో టీడీపీలో తనకు పదవులు వస్తాయని అనగాని సత్యప్రసాద్ భావించారు. చంద్రబాబు కూడా అనగాని సత్యప్రసాద్ కుహామీ ఇవ్వడంతో ఆయన చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారన్న టాక్ నియోజకవర్గంలో విన్పిస్తుంది.

Tags:    

Similar News