టీడీపీ ఉద్దండుల కోట‌లో ఒకే ఒక్కడు స‌క్సెస్సా..?

తెలుగుదేశం పార్టీ పేరు చెపితే క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే క‌మ్మ నేత‌ల‌దే పూర్తి [more]

Update: 2021-01-18 11:00 GMT

తెలుగుదేశం పార్టీ పేరు చెపితే క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఎంతగా ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే క‌మ్మ నేత‌ల‌దే పూర్తి పెత్తనం. అస‌లు పార్టీ ఈ మూడున్నర ద‌శాబ్దాల్లో ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ రెండు జిల్లాల నుంచి త‌ప్పకుండా క‌మ్మ మంత్రి ఉండాల్సిందే. అంతెందుకు గ‌త ప్రభుత్వంలోనూ గుంటూరులో ప్రత్తిపాటి పుల్లారావు, కృష్ణాలో దేవినేని ఉమా మంత్రులు. ఇక ఈ రెండు జిల్లా కేంద్రాల ఎంపీలు టీడీపీ నుంచి మాత్రం క‌మ్మ నేత‌లే బ‌రిలో ఉంటూ ఉంటారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో గుంటూరు, న‌ర‌సారావుపేట ఎంపీ క్యాండెట్లు క‌మ్మలే. అంతే కాకుండా తెనాలి, మంగ‌ళ‌గిరి, పొన్నూరు, చిల‌క‌లూరిపేట‌, స‌త్తెన‌ప‌ల్లి, గుర‌జాల‌, వినుకొండ‌, పెద‌కూర‌పాడు మొత్తం ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల నుంచి క‌మ్మ నేత‌లే బ‌రిలో ఉన్నారు. ఈ ప‌ది మందిలో గుంటూరు నుంచి ఎంపీగా జ‌య‌దేవ్ మిన‌హా ఎవ్వరూ గెల‌వ‌లేదు.

పార్టీ మారతారంటూ..?

అలాంటి క‌మ్మ కోట‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి జ‌గ‌న్ చెంత చేరిపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లా పేరు చెపితే ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. రేప‌ల్లె నుంచి వ‌రుస‌గా రెండోసారి గెలిచిన అన‌గాని స‌త్యప్రసాద్ మాత్రమే పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. మ‌ధ్యలో అన‌గాని స‌త్యప్రసాద్ కూడా పార్టీ మారిపోతున్నారంటూ ప్రచారం జ‌రిగింది. దీని వెన‌క వైసీపీ మైండ్ గేమ్ కూడా ఉంది. గుంటూరు జిల్లాలో వైసీపీకి బ‌ల‌మైన బీసీ నాయ‌కుల కొర‌త ఉంది. పైగా ఇంత వేవ్‌లో కూడా రేప‌ల్లెలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, ప్రస్తుత రాజ్యస‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌పై అన‌గాని స‌త్యప్రసాద్ భారీ మెజార్టీతో గెలిచారు.

వీక్ చేసేందుకు…..

అన‌గాని స‌త్యప్రసాద్ ని నియోజ‌క‌వ‌ర్గంలో వీక్ చేసేందుకు జ‌గ‌న్ అక్కడ రెండుసార్లు ఓడిన మోపిదేవికి మంత్రి ప‌ద‌వి ఇవ్వడంతో పాటు తాజాగా రాజ్యస‌భ‌కు కూడా పంపాల్సిన ప‌రిస్థితి. మోపిదేవి రాజ్యస‌భ‌కు వెళ్లాక రేప‌ల్లెలో వైసీపీకి స‌రైన ద‌శ దిశ లేక మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ క్రమంలోనే మోపిదేవిని వైసీపీలోకి తీసుకువెళ్లే ప్రయ‌త్నాలు జ‌రిగినా ఆయ‌న మాత్రం స‌సేమీరా ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు జిల్లాలో టీడీపీ కార్యక్రమాల్లో పూర్తి దూకుడుతో ముందుకు వెళుతూ చంద్రబాబు ప్ర‌శంస‌లు పొందుతున్నారు. నిజానికి ఉద్దండులు, బ‌ల‌మైన క‌మ్మ నేత‌లు ఉన్న ఈ జిల్లాలో ఓ బీసీ ఎమ్మెల్యేగా ఏకాకిగా ఉండ‌డంతో పాటు పార్టీని ముందుకు న‌డిపిండంలో అన‌గాని స‌త్యప్రసాద్ త‌న వంతు పాత్ర పోషిస్తున్నారు.

ఏ కార్యక్రమం జరిగినా…..?

బాప‌ట్ల పార్లమెంట‌రీ అధ్యక్షుడిగా ఎంపికైన ఏలూరి సాంబ‌శివ‌రావుతో ఇటు స‌మ‌న్వయం చేసుకుంటూ.. అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ ఆదేశాల‌కు అనుగుణంగా అన‌గాని స‌త్యప్రసాద్ ముందుకు వెళుతున్నారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జ‌రిగినా అన‌గాని స‌త్యప్రసాద్ ముందుంటున్నారు. తాజాగా గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో పెద‌గార్లపాడు మాజీ స‌ర్పంచ్ పురంశెట్టి అంకులు హ‌త్య జ‌రిగిన కొద్ది గంట‌ల్లోనే అక్కడకు చేరుకున్న అన‌గాని స‌త్యప్రసాద్ అక్కడ పార్టీ కేడ‌ర్‌కు అండ‌గా నిలిచి వారిలో ధైర్యం నింపారు. గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని, అన‌గాని క‌లిసి క్క‌డ పార్టీకి జ‌రిగిన అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ చేయ‌డంలో త‌మ వంతు పాత్ర పోషించారు. త‌ర్వాత అక్కడ‌కు వ‌చ్చిన యువ‌నేత లోకేష్ ప‌ర్యట‌న సైతం స‌క్సెస్ అయ్యింది.

బాబు మెచ్చుకోలు….

ఈ సంఘ‌ట‌న‌పై చంద్రబాబు అన‌గాని స‌త్యప్రసాద్ ని స్పీడ్‌ను ప్రత్యేకంగా మెచ్చుకోవ‌డంతో పాటు అన‌గాని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పార్టీ శ్రేణుల‌కు జూమ్ మీటింగ్‌లో సూచించారు. జిల్లా టీడీపీలో ఇప్పుడు చాలా మంది కీల‌క నేత‌లు సైలెంట్‌గా ఉన్నా.. రేపు ఎన్నిక‌ల వేళ మ‌ళ్లీ అంతా తామే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తుంటారు. వీరిని త‌ట్టుకుని అన‌గాని స‌త్యప్రసాద్ ఎలా నిల‌బ‌డ‌తాడో ? చూడాలి. ఏపీలో మ‌ళ్లీ పార్టీ అధికారంలోకి వ‌స్తే అన‌గాని స‌త్యప్రసాద్ కి కాలం క‌లిసొస్తే కేబినెట్ పోస్టు ద‌క్కినా ద‌క్కవ‌చ్చు.

Tags:    

Similar News