ఇలాగయితే ఎలా? సీఎంవో నుంచి ఆనంకు ఫోన్?

“ఇలా అయితే ఎలా ? మీ స‌మ‌స్యలు ఏవైనా ఉంటే.. నేరుగా మీడియా ముందుకు వ‌చ్చేయ‌డ‌మేనా ?.. మన‌మీద ఉన్న న‌మ్మ కాన్ని వ‌మ్ము చేస్తామా?“ నెల్లూరు [more]

Update: 2020-06-09 12:30 GMT

“ఇలా అయితే ఎలా ? మీ స‌మ‌స్యలు ఏవైనా ఉంటే.. నేరుగా మీడియా ముందుకు వ‌చ్చేయ‌డ‌మేనా ?.. మన‌మీద ఉన్న న‌మ్మ కాన్ని వ‌మ్ము చేస్తామా?“ నెల్లూరు జిల్లాలో ఈ రోజు మార్నింగ్ ఓ సీనియ‌ర్ వైసీపీ నేత‌కు తాడేప‌ల్లి నుంచి వెళ్లిన ఫోన్ సారాంశం ఇది! ఫోన్ చేసిన వారు ఎవ‌రు.. అనే విష‌యం ర‌హ‌స్యంగా ఉన్నప్పటికీ.. ఫోన్ ఎవ‌రికి వెళ్లింద‌నే విష‌యం మాత్రం నెల్లూరులో అందరికీ తెలిసిపోయింది. ఇటీవ‌ల నెల్లూరులో త‌న నియోజ‌క‌వ‌ర్గం వెంక‌ట‌గిరి అభివృద్ధిపై సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి సీఎంవో నుంచి ఫోన్‌వెళ్లింది. సీరియ‌స్ లేదు.. అలాగ‌ని లైట్ కాదు! మొత్తానికి చెప్పాల్సిన మెసేజ్ చెప్పేసి. ఫోన్ క‌ట్ చేశారు.

వ్యతిరేక శక్తులు…..

ఈ ఫోన్ స‌మాచారానికి సంబంధించి ఆనం వ‌ర్గీయులు చూచాయ‌గా మీడియాకు అందించిన స‌మాచారం ప్రకారం.. గ‌తంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఇలానే వ్యవ‌హరించారా? వారంతా కూడా బాబు పాల‌న‌ను వెనుకేసుకురాలేదా ? ఇప్పుడు మ‌న‌లో మ‌నం రోడ్డున ప‌డితే.. పార్టీకి.. అంతిమంగా అంద‌రికీ కూడా చెడ్డపేరు రాదా? అనే సూచ‌న‌లు అందాయ‌ని చెబుతున్నారు. ఏడాది కింద‌ట రాష్ట్రంలో ఏర్పాటైన జ‌గ‌న్ ప్రభుత్వంపై అనేక మంది రాళ్లు రువ్వే ప్రయ‌త్నం చేశార‌ని, ఈ క్రమంలోనే రెడ్డి రాజ్యం ఏర్పడుతుంద‌నే ప్రచారం కూడా చేశార‌ని, కానీ, ఇలాంటి వ్యతిరేక శ‌క్తుల‌కు భిన్నంగా జ‌గ‌న్ అంద‌రివాడు అనిపించుకునేలా త‌న వ్యూహానికి ప‌దును పెంచి.. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేసిన విష‌యాన్ని గుర్తు చేశార‌ట‌.

ఐకమత్యమేదీ?

రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లు సంయ‌మ‌నంతో వ్యవ‌హ‌రించ‌క‌పోతే.. మున్ముందు జ‌గ‌న్‌పై విమ‌ర్శల రాళ్లు విసిరేందుకు ప్రయ‌త్నిం చేవారు పెరుగుతార‌ని.. మ‌న‌లో ఐక్యత లేద‌నే భావ‌న కూడా ప్రబ‌లుతుంద‌ని ఫోన్‌లోనే ఆనంకు క్లాస్ ఇచ్చార‌ని అంటున్నారు. ఏదైనా ఉంటే.. నేరుగా అధికారుల‌ను సంప్రదించే అవ‌కాశం ఉంద‌ని కూడా స‌ద‌రు ఫోన్ చేసిన నాయ‌కుడు తెలిపాడ‌ని అంటున్నా రు. అంతేత‌ప్ప.. మ‌న‌లో మ‌నమే.. కీచులాడుకుంటూ.. రాళ్లు రువ్వుకుంటూ.. ఉంటే.. ప్రజ‌ల‌కు.. ప్రతిప‌క్షాలు ఎలాంటి సందేశాన్ని పాస్ చేస్తాయో.. తెలిసిందేన‌ని చెప్పార‌ట‌. మొత్తంగా చూస్తే.. స‌మ‌స్యప‌రిష్కారంపై దృష్టి పెట్టేందుకు ఉన్న అన్ని మార్గాల‌నూ అన్వేషించేందుకు ప్రయ‌త్నించాలే త‌ప్ప.. వీధిన ప‌డ‌డం స‌రైన విధానం కాద‌నేది సందేశం. మ‌రి నిజంగానే రెడ్డి సామాజిక వ‌ర్గం కోరుకున్న ప్రభుత్వంలో రెడ్లు ఐక‌మ‌త్యంతో ముందుకు సాగుతారో లేదో చూడాలి.

Tags:    

Similar News