ఆనం మాటలకు అర్థం అదేనా?

ఆనం రామనారాయణరెడ్డి. సీనియర్ లీడర్. నెల్లూరు జిల్లాను ఒకప్పుడు శాసించిన ఆనం కుటుంబం ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికే పరిమితమయింది. వెంకటగిరికే ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీ పరిమితం చేసింది. [more]

Update: 2020-12-30 06:30 GMT

ఆనం రామనారాయణరెడ్డి. సీనియర్ లీడర్. నెల్లూరు జిల్లాను ఒకప్పుడు శాసించిన ఆనం కుటుంబం ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికే పరిమితమయింది. వెంకటగిరికే ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీ పరిమితం చేసింది. ఆనం కుటుంబానికి నెల్లూరు పట్టణ నియోజకవర్గంలోనూ, రూరల్ నియోజకవర్గంలోనూ పట్టు ఉన్నా వారిని ఎంటర్ కానివ్వడం లేదు. వెంకటగిరిలోనూ ఆనం రామనారాయణరెడ్డి పనులు సాగడం లేదు. దీంతో ఆయన పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారు.

బరస్ట్ అయినా…..

అందుకే కొన్ని సార్లు ఆనం రామనారాయణరెడ్డి బరస్ట్ అయ్యారు. ఒక దశలో హైకమాండ్ నుంచి షోకాజ్ నోటీసులు అందుకుంటారని కూడా అందరూ భావించారు. అయితే ఆ తర్వాత జగన్ ను కలసి వివరణ ఇవ్వడంతో షోకాజ్ నోటీసులు విరమించుకున్నారు. అయితే దాదాపు ఎనిమిది నెలల నుంచి జగన్ ను మళ్లీ కలవలేదు. ఆనం రామనారాయణరెడ్డిలో మాత్రం అసంతృప్తి తగ్గినట్లు కన్పించడం లేదు.

ఉప ఎన్నికలోనూ పక్కన పెట్టి…..

ఆనం రామనారాయణరెడ్డితో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పని ఉంది. వెంకటగిరి ఎమ్మెల్యేగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ ఎన్నికలో కూడా వైసీపీలోని కొందరు నేతలు ఆనం రామనారాయణరెడ్డిని దూరంగా పెట్టాలని భావిస్తున్నారు. ఆయన ప్రమేయం లేకుండానే వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీకి అత్యధిక మెజారిటీ తెప్పించి ఆనంను మానసికంగా దెబ్బకొట్టాలని కొందరు నేతలు భావిస్తున్నారు.

అందుకేనా అలా అనింది…..

ఇదంతా గమనించిన ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని వ్యాఖ్యానించడం మళ్లీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంటే ఆయన టీడీపీకి చేరువయ్యే అవకాశాలున్నాయని వైసీపీ నేతలే అనుమానిస్తున్నారు. తమ కుటుంబాన్ని నెెల్లూరు నగరానికి దూరం చేయడాన్ని కూడా ఆయన తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా వైసీపీ అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆనం మాటలకు అర్థాలు వెతుక్కునే పనిలో పడ్డారు వైసీపీ నేతలు.

Tags:    

Similar News