ఆనం అలా ఫిక్స్ అయిపోయారు

ఆనం రామనారాయణరెడ్డి.. సీనియర్ నేత. కానీ అధికార వైసీపీలో ఆయన కంఫర్ట్ గా లేరని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన ఇప్పటికిప్పుడు సంచలన నిర్ణయం ఏదీ తీసుకోకపోయినా [more]

Update: 2020-06-04 12:30 GMT

ఆనం రామనారాయణరెడ్డి.. సీనియర్ నేత. కానీ అధికార వైసీపీలో ఆయన కంఫర్ట్ గా లేరని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన ఇప్పటికిప్పుడు సంచలన నిర్ణయం ఏదీ తీసుకోకపోయినా ఆనం రామనారాయణరెడ్డి మాత్రం పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారతారన్నది మాత్రం యదార్థం. అందుకే తరచూ ఆయన ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయకుండా అధికారులపై విరుచుకుపడుతున్నారు.

ఎన్నికలకు ముందు చేరినా…

ఆనం రామనారాయణరెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అప్పటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకున్నా జగన్ మాత్రం ఆయనకు సీటు ఇచ్చారు. అయితే తనకు పట్టున్న ఆత్మకూరు నియోజకవర్గం కాకుండా ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి నియోజకవర్గం ఇచ్చినా ఆయన సైలెంట్ గానే వెళ్లి అక్కడ గెలిచారు. తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆనం రామనారాయణరెడ్డి ఆశించారు.

చోటు దక్కలేదనేనా?

కానీ తొలి మంత్రివర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి కి చోటు దక్కలేదు. నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీని పదేళ్ల నుంచి అంటిపెట్టుకున్న అనేక మంది నేతలున్నారు. సీనియర్ నేతలు కూడా ఉండటంతో రెండో దఫా విస్తరణలో కూడా ఆనం రామనారాయణరెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం లేదు. అందుకే ఆనం రామనారాయణరెడ్డి ఫిక్స్ అయినట్లే కన్పిస్తున్నారు. తాను 23 జిల్లాలకు మంత్రిగా పనిచేసిన విషయాన్ని ఆయన పార్టీకి మరోసారి గుర్తు చేశారు.

తాడో పేడో తేల్చుకునేందుకేనా?

అయితే ఆనం రామనారాయణరెడ్డి జల వనరుల శాఖమీదనే పడటం ఆ మంత్రిని టార్గెట్ చేయడానికే అంటున్నారు. గతంలో ఇసుక మాఫియా నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పి కోటంరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. అప్పుడే వైసీపీ అధినాయకత్వం ఆనం రామనారాయణరెడ్డికి నోటీసులు ఇవ్వాలనుకున్నారు. కానీ జగన్ తో భేటీ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇన్ ఛార్జి మంత్రిని కూడా అప్పట్లో మార్చారు. కానీ ఆనం రామనారాయణరెడ్డి మాత్రం మరోసారి ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తుంటే వైసీపీ అధినాయకత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యారనిపిస్తుంది.

Tags:    

Similar News