ఏపీ లో స్వాములకు ఫుల్ డిమాండ్

పేరుకు వారు సర్వసంగ పరిత్యాగులు. కానీ వారే ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రాలుగా మారిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరింత మంది స్వామీజీలు కావలెను. [more]

Update: 2020-10-02 09:30 GMT

పేరుకు వారు సర్వసంగ పరిత్యాగులు. కానీ వారే ఇప్పుడు రాజకీయ పార్టీలకు ప్రధాన అస్త్రాలుగా మారిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరింత మంది స్వామీజీలు కావలెను. ఎందుకంటే మత రాజకీయాలకు ఎపి కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార వైసిపి, విపక్ష టిడిపి, బిజెపి, జనసేన ల వాయిస్ లను ఛానెల్స్ లో వినిపించే సమర్థులు కావలెను అని సోషల్ మీడియా లో గట్టిగానే సెటైర్లు పడుతున్నాయి. ఎలాగూ ఆయా పార్టీల ఛానెల్స్ సోషల్ మీడియా విభాగాలు ఉన్న నేపథ్యంలో వీరి అవసరం అందరికి ఒకేసారి ఏర్పడింది. వీరికి తోడు వైసిపి మంత్రులైతే ఏకంగా స్వామిజీ లను మించిన హంగామా చేస్తున్నారు.

గొంతు నిండా పని …

ప్రస్తుతం అధికారపార్టీ తరపున స్వామిజీ గా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అందరికి సుపరిచితులు. అయితే ఈ మధ్యన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు తగ్గించారు. ఇక కమలానంద భారతి స్వామిజీ అయితే టిడిపి వకాల్తా పూర్తిగా పుచ్చేసుకున్నారు. రాజధాని ఉద్యమం నుంచి మత వివాదాలవరకు కమలానంద చంద్రబాబు ఛానెల్స్ లో ప్రధాన స్పీకర్. ఇక బిజెపి తరపున ఆ పార్టీ వారు ఉండగానే పరిపూర్ణానంద సీన్ లోకి వస్తున్నారు. జనసేన తరపున ఆ పార్టీ ప్రతినిధులు చర్చల్లో అలరిస్తున్నారు. అయినా కానీ ఎపి లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎంతమంది స్వామీజీలు ఉన్నా ఇంకా లోటు మాత్రం కనిపిస్తూనే ఉంది. త్వరలోనే స్వామీజీల ఖాళీ స్థానాలు భర్తీ అవుతాయేమో చూడాలి.

Tags:    

Similar News