Andhra politics : మూడు సార్లు కాపు దెబ్బ రుచిచూసినా?

ఆంధప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందు మారే అవకాశాలున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాపు సామాజికవర్గం [more]

Update: 2021-10-06 05:00 GMT

ఆంధప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందు మారే అవకాశాలున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కాపు సామాజికవర్గం ఏ స్టాండ్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాపు రిజర్వేషన్ల అంశం రానున్న ఎన్నికల్లో కీలకంగా మారనుంది. అయితే ఇది టీడీపీకి అడ్వాంటేజీగా మారనుందా? లేక వైసీపీ అనుకూలమా? అన్న చర్చ జరుగుతోంది.

1989లో తొలిసారి….

తెలుగుదేశం పార్టీ కాపుల దెబ్బ ఇప్పటికే రుచి చూసింది. ఇప్పటికి మూడుసార్లు టీడీపీ కాపుల వ్యతిరేకమవ్వడంతో ఓటమి పాలయింది. 1989 లో వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి కారణం కాపుల నుంచి వెల్లువలా వచ్చిన వ్యతిరేకతే కారణం. రంగా హత్య ఏపీ రాజకీయాల్లో కులాల ప్రభావాన్ని మరింత పెంచిందనే చెప్పాలి. ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి కాపులు శాపంగా మారారు.

చిరు, పవన్ ల పార్టీలతో….

2009లో చంద్రబాబు విజయం సాధించాలనుకున్నారు. కాంగ్రెస్ అప్పటికే ఒకసారి గెలిచి ఉండటంతో ఈసారి గెలుపు తనదేనని భావించారు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ఆ ఆశ నెరవేరలేదు. ప్రజారాజ్యం వల్లనే తాను కూటమి పెట్టినా చంద్రబాబు గెలవలేకపోయారు. ఇక 2019 ఎన్నికల్లోనూ అదే పరిస్థితి చంద్రబాబుకు ఎదురయింది. ఒంటరిగా పోటీ చేసి చేయి కాల్చుకున్నారు. ఈఎన్నికల్లో జనసేన పార్టీ విడిగా పోటీ చేయడంతో చంద్రబాబుకు మరోసారి కాపుల దెబ్బ తప్పలేదు.

ఈసారి ఎలా?

అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు కాపు సామాజికవర్గం కీలకంగా మారనుంది. కాపుల మద్దతు ఉంటేనే విజయం దక్కుతుంది. లేకుంటే మరోసారి పరాజయం తప్పదు. అందుకే చంద్రబాబు జనసేనతో కలసి వెళ్లాలన్న యోచనలో ఉన్నారు. జనసేనతో పొత్తు కుదిరితే చంద్రబాబుకు సానుకూలంగా ఉంటుంది. లేకుంటే నాలుగోసారి కాపుల దెబ్బ రుచిచూడటానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.

Tags:    

Similar News