జర్మనీ జయించింది… ఈమె ముందస్తు వ్యూహంతోనే?
అభివృద్ధికి, ఆధునికతకు మారుపేరుగా తనకు తాను జబ్బలు చరుచుకునే ఐరోపా ఖండం కరోనాతో అతలాకుతలం అవుతోంది. ఈ ఖండంలోని అనేక దేశాలు ఈ అనూహ్య ఉత్పాదానికి భీతిల్లుతున్నాయి. [more]
అభివృద్ధికి, ఆధునికతకు మారుపేరుగా తనకు తాను జబ్బలు చరుచుకునే ఐరోపా ఖండం కరోనాతో అతలాకుతలం అవుతోంది. ఈ ఖండంలోని అనేక దేశాలు ఈ అనూహ్య ఉత్పాదానికి భీతిల్లుతున్నాయి. [more]
అభివృద్ధికి, ఆధునికతకు మారుపేరుగా తనకు తాను జబ్బలు చరుచుకునే ఐరోపా ఖండం కరోనాతో అతలాకుతలం అవుతోంది. ఈ ఖండంలోని అనేక దేశాలు ఈ అనూహ్య ఉత్పాదానికి భీతిల్లుతున్నాయి. ఏవో కొన్ని దేశాలు తప్ప అనేక దేశాలు కరోనాధాటికి కాకా వికలమవుతున్నాయి. ఇటలీ, స్పెయిన్ వంటిదే శాల పరిస్ధితి చెప్పనక్కర్లేదు. వేలకొద్ది మరణాలతో ఈ దేశాలలో మరణమృదంగం మోగుతోంది. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లోను ఈ ఖండం లోని రెండు ముాడు దేశాలు కరోనాను తట్టుకుని నిలబడ్డాయి. వాటిల్లో జర్మనీది ప్రధమస్ధానం. జర్మనీ పేరు చెప్పగానే హిట్లర్, నాజీలు గుర్తుకు వస్తారు. రెండు జర్మనీలు తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ మదిలో మెదులుతాయి. 1990 లో ఈ రెండు జర్మనీలు విలీనమయ్యాయి. ఒక్కటిగా ఏర్పడ్డాయి.
ఏకమైన తర్వాత…..
బెర్లిన్ తుార్పు జర్మనీకి, బాన్ పశ్చిమ జర్మనీకి రాజధానులు ఇప్పడు బాన్ రాజధానిగా ఉన్న జర్మనీకి ఏంజిలా మార్కెల్ ఛాన్సలర్. మన దేశంలో ప్రధాని పదవి లాంటిది అక్కడ ఛాన్సలర్ పదవి మహిళా నేత అయిన ఏంజిలా మార్కెల్ జర్మనీ ఛాన్సలర్ గా కరోనా కట్టడిలో విజయవంతంగా వ్యవహరించి అంతర్జాతీయంగా పలువురి ప్రశంసలు అందుకున్నారు. 8.3 కోట్ల జనాభా గల ఈ ఐరోపా దేశం ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ద్వారా కరోనాను కట్టడి చేయగలుగుతోంది. కేసులు, మరణాలను అడ్డకోగలుతోంది. కరోనా వార్తలు వెలుగు చూసే నాటికి బెర్లిన్ నగరంలోని ఛారిటీ ఆస్పత్రి వైరస్ టెస్టింగ్ పద్ధతిని కనిపెట్టింది. దీనిని ఆన్ లైన్లో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిబ్రవరిలో దేశంలోని అన్ని ప్రయెాగశాలల్లో, టెస్ట్ కిట్లను సిద్ధంగా ఉంచింది. ముందుగా పరీక్షలపై దృష్టి సారించింది. ఐరోపా ఖండంలోని ఏ దేశం చేయనన్ని పరీక్షలు ఇక్కడ చేస్తున్నారు. వారానికి కనీసం 3.5 లక్షల పరీక్షలు చేస్తున్నట్లు అంచనా. పరీక్షల్లో ఏ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా ఆ ప్రాంతంలోని అందరికీ పరీక్షలు చేస్తున్నారు.
ఇళ్లల్లోనే పరీక్షలు.. ఆ తర్వాత…..
బాధితులకు ఇళ్ళల్లోనే పరీక్షలు చేస్తున్నారు. వైద్యులు వాహనాల్లో నెేరుగా బాధితుల ఇళ్ళకు వెళుతున్నారు. పరిస్ధితి మెరుగుపడని పక్షంలో మాత్రమే వైద్యశాలలకు తరలిస్తున్నారు. కరోనా వార్తలు వెలుగుచుాసే నాటికే ఆస్పత్రులను సిద్ధం చేసింది సర్కారు. పడకల సంఖ్యను పెంచింది. తగిన మేరకు వెంటిలేటర్లను సమకూర్చుకుంది. సిబ్బంది సంఖ్యను 50 శాతం పెంచింది. భౌతిక దుారం పాటించడం, మాస్కులు, గ్లౌజులు ధరించడంలో పౌరులు ఎంతమాత్రం ఆలస్యం చెయలెేదు. వ్యాధి తీవ్రతపై ప్రజల్లో అవగాహన, చైతన్యం రావటానికి ప్రభుత్వం విశేష కృషి చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజల్లో క్రమశిక్షణతో పాటించాయి. వైద్యులు, నర్సులకు సర్కార్ కట్టుదిట్టమైన భద్రత కల్పించింది.
ఆరోగ్య రంగంపై…..
ఆరోగ్య రంగంపై జర్మనీ ప్రభుత్వం శ్రద్ధవహించింది. 8 కోట్లకు పైగా జనాభా, 16 రాష్ర్టాలు గల ఈ దేశంలో విద్య , వైద్య రంగాలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నయి. ఏటా ప్రతి పౌరుడి ఆరోగ్య సంరక్షణ కోసం సర్కార్ కనీసం 4 లక్షలు వెచ్చిస్తుంది. ఇది చాలా దేశాల కన్నా చాల ఎక్కువ. దేశంలో ప్రతి పౌరుడికీ తప్పని సరిగా ఆరోగ్య బీమా ఉంటుంది. ప్రతి లక్ష మందికి 621 పడకలున్నాయని అంచనా. దాదాపు 28 వేల వెంటిలెేటర్లు, 40 వేల ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నయి. ఏప్రిల్ 19 నాటికి 1.40 లక్షల కేసులు నమెాదుకాగా మరణాలను నాలుగువేలకే పరిమితం చేమగలిగింది. వ్యాధిని గుర్తించడం, పరీక్షించడం, చికిత్స చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కట్టడి చేయగలిగింది. మెుదట్లో ఒకరి ద్వారా అయిదుగురు నుంచి ఏడుగురికి వ్యాధి సోకింది. ఇప్పుడు దానిని 1.2 నుంచి 1.5 కు పరిమితం చేసింది. మార్చి 22న లాక్ డౌన్ ను విధించింది. అయిదు ఇరుగు పొరుగు దేశాల సరిహద్దులను ముాసి వేసింది. దేశవ్యాప్తంగా 132 కేంద్రాల్లో వారానికి 3 నుంచి 5 లక్షల వరకు పరీక్షలను చేస్తున్నారు. టెలీ మెడిసిన్ వ్యవస్ధను అందుబాటులోకి తెచ్చింది. వ్యాధి నియంత్రణకు కంటెయిన్ మెంట్ లను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం చేపట్టిన పకడ్బందీ చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్