ఆశ అదొక్కటే

స్థానిక సంస్థల ఎన్నికలు తమిళనాడులో అధికార, విపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నాంగునేరి, విక్రంవాడి [more]

Update: 2019-12-03 17:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలు తమిళనాడులో అధికార, విపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. నాంగునేరి, విక్రంవాడి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల నాయకత్వంపై క్యాడర్ లోనూ కొంత నమ్మకం ఏర్పడిందంటున్నారు.

పొత్తు పెట్టుకుని….

గత లోక్ సభ ఎన్నికలు, దీంతో పాటు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పెద్దగా ప్రభావం చూపలేదు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తులతో ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ, పీఎంకే, డీఎండీకే వంటి పార్టీలతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ఫలితం కన్పించలేదు. క్యాడర్ లో అధైర్యం వచ్చేసింది. దీంతో కొందరు జైలు నుంచి విడుదలయ్యే శశికళ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. శశికళ రాకను కొందరు మంత్రులు సయితం స్వాగతిస్తున్నారు.

శశికళ ను రానిచ్చేది లేదని…..

అయితే పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు మాత్రం శశికళ విషయంలో ఫర్మ్ గానే ఉన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లో పార్టీలోకి చేర్చుకునేదిల లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కొత్త పార్టీ పెట్టినా అది సఫలం కాలేదు. శశికళ వచ్చినా అదే పరిస్థితి ఉంటుందని పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు అంచనా వేస్తున్నారు. అందుకే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటాలని ఇద్దరూ ఉవ్విళ్లూరుతున్నారు.

సక్సెస్ పెయిర్ అంటూ…..

తమ జోడీ సక్సెస్ అయిందన్నది పళనిస్వామి, పన్నీర్ సెల్వం నమ్మకం. అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు తమకు అనుకూలంగా మారతాయని ఇద్దరూ భావిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ పార్టీల ఆవిర్భావంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు అనుకూలంగా మారుతుందని నమ్మకంగా ఉన్నారు. అందుకే క్యాడర్ ను కాపాడుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్దమవ్వాలని నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News