మూడు గ్రూపులతో సతమతం.. వైసీపీ ఎమ్మెల్కేకు కొత్త చిక్కులు

వైసీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మూడు గ్రూపులతో సతమతమవుతున్నారు. ఏ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినా మరో వర్గం కస్సుమంటుంది. దీంతో ఆ ఎమ్మెల్యే అన్ని రకాలుగా ఇబ్బంది [more]

Update: 2021-05-12 02:00 GMT

వైసీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మూడు గ్రూపులతో సతమతమవుతున్నారు. ఏ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినా మరో వర్గం కస్సుమంటుంది. దీంతో ఆ ఎమ్మెల్యే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు పరిస్థితి ఇది. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎవరికి పనులు చేసిపెట్టాలన్నా ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందిగా మారింది. ఇందుకు కారణం గిద్దలూరు వైసీపీలో మూడు గ్రూపులు ఉండటమే.

విజయం సాధించినా?

అన్నారాంబాబు తొలుత ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009 లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీలో చేరి 2014లో ఓటమి పాలయ్యారు. అయితే అప్పుడు విజయం సాధించిన ముత్తముల అశోక్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీలో ఉన్న అన్నా రాంబాబు వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి రాష్ట్రంలో జగన్ తర్వాత 81,035 ఓట్ల అత్యధిక మెజారిటీని సాధించారు.

బాలినేని తో సిఫార్సు…..

అయితే జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో పార్టీ వీడిపోయిన ముత్తముల అశోక్ రెడ్డికి చెందిన ముఖ్య అనుచరులు వైసీపీలోకి తిరిగి వచ్చారు. దీనికి కారణం మంత్రి బాలినేని అంటున్నారు. ముత్తముల పార్టీలో చేరాలని అనుకున్నా జగన్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన ఎంట్రీ కుదరలేదు. దీంతో ముత్తముల అశోక్ రెడ్డి వర్గం ఇప్పుడు గిద్దలూరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పనుల్లో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి చేత సిఫార్సు చేయించుకుంటున్నారు.

టీడీపీ నుంచి వచ్చిన వారికి…..

ఇక అన్నా రాంబాబు టీడీపీలో ఉన్న ప్పుడు తనతో కలసి నడిచిన వారు కూడా వైసీపీలో చేరారు. వారిది ప్రత్యేక వర్గం. ఇక తొలి నుంచి అభ్యర్థి ఎవరైనా వైసీపీ కోసం నిలబడిన నేతలున్నారు. వారిదొక వర్గం. ఇప్పుడు అన్నారాంబాబు తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మంత్రి చేత సిఫార్సు చేయించుకుని ముత్తముల వర్గం బాగానే పనులు సంపాదిస్తుంది. ఎటూ కాకుండా పోయింది తొలి నుంచి వైసీపీలో ఉన్నవారేనన్న టాక్ ఉంది. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మూడు గ్రూపులతో సతమతమవుతున్నారు.

Tags:    

Similar News