Ycp : ఈయనకు మళ్లీ టిక్కెట్ ఇచ్చారో…. సీటు గల్లంతే

తెలుగుదేేశం పార్టీ క్రమంగా పుంజుకుంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉంది. కొన్ని చోట్ల టీడీపీ సక్సెస్ అవుతుందనే చెప్పాలి. ప్రకాశం జిల్లా [more]

Update: 2021-11-07 12:30 GMT

తెలుగుదేేశం పార్టీ క్రమంగా పుంజుకుంటుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో ఉంది. కొన్ని చోట్ల టీడీపీ సక్సెస్ అవుతుందనే చెప్పాలి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి. ఆయనను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. దీనిని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ముత్తుముల అశోక్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

జగన్ తర్వాత….

మొన్నటి ఎన్నికల్లో జగన్ తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది అన్నారాంబాబుకే . దాదాపు 70 వేల మెజారిటీ రావడంతో ఆయన వైసీపీ అధినాయకత్వం దృష్టిలో పడ్డారు. గిద్దలూరు సామాజిక సమీకరణాలు చూసుకుంటే వైసీపీకే ఎక్కడ ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అయితే 2009లో ఇదే అన్నా రాంబాబు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గంతో వైశ్యులు కూడా గంపగుత్తగా అన్నా రాంబాబుకు ఓటు వేయడంతో ఆయన భారీ మెజారిటీని సాధించారు.

ముఖ్యమైన వర్గాలను…

అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారాంబాబు ముఖ్యమైన నేతలతో పాటు ఒక వర్గాన్ని దూరం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తనతో పాటు ప్రజారాజ్యం, టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో పార్టీలో అసంతృప్తి పెరిగింది. ముఖ్యమైన పనులన్నీ కొందరికే అప్పగిస్తున్నారన్న విమర్శకూడా ఉంది. ఇప్పటికే ఇక్కడి నేతలు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది.

వలసలు షురూ….

అన్నా రాంబాబుపై వ్యతిరేకతను టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి ముత్తముల అశోక్ రెడ్డి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు ఇలా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. చూసేందుకు వీరు చిన్న స్థాయి నేతలుగానే కనపడుతున్నా ఎన్నికల సమయంలో వీరి ప్రభావం ఎక్కువగానే ఉంది. జనసేన కూడా ఇక్కడ బలంగా ఉండటంతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారయితే అన్నా రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో చుక్కలు కనపడక మానవు.

Tags:    

Similar News