టిక్కెట్ మీద ఆశ పెట్టుకోవచ్చా… ?

జగన్ ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్ధం కావు. ఆయన పదవులు పంచుతారు. అలా వచ్చిన వాటిని తీసుకోవడమే. ఇక కోరికలు ఎన్ని చెప్పుకున్నా ఆ మీదట ఆయన [more]

Update: 2021-09-01 02:00 GMT

జగన్ ఆలోచనలు ఏంటో ఎవరికీ అర్ధం కావు. ఆయన పదవులు పంచుతారు. అలా వచ్చిన వాటిని తీసుకోవడమే. ఇక కోరికలు ఎన్ని చెప్పుకున్నా ఆ మీదట ఆయన దయ, కోరిక వారి ప్రాప్తం అన్నట్లుగా వైసీపీలో సీన్ నడుస్తుంది. ఇదిలా ఉంటే విశాఖలో చాలా మందికి పదవులు దక్కాయి. అందులో ఎమ్మెల్యే టికెట్ మీద ఆశలు పెట్టుకున్న వారికి కూడా నామినేటెడ్ పదవులు పంచి శాంతపరచారు. సరే ఇచ్చింది తీసుకున్నారు. కానీ అసలు టార్గెట్ వేరు కదా. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని గెలిచి ఎమ్మెల్యే కావాలన్నది కదా కల అని వైసీపీ నేతలు అంటున్నారు.

రేసులో ఉన్నా….

ఇక వైసీపీలో ఎమ్మెల్యే స్థాయి నేతలు చాలా మంది ఉన్నారు. వారిలో గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కీలక నేత చొక్కాకుల వెంకటరావు ఉన్నారు. ఈయన వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ కోసం చాలానే ఖర్చు చేశారు. ఫలితంగా 2014 ఎన్నికలలో విశాఖ ఉత్తరం సీటు దక్కింది. ఇక ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2019లో ఆ టికెట్ ని కెకె రాజుకు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాజు గారికే టికెట్ అని కన్ ఫర్మ్ చేసేశారు. దీంతో వెంకటరావు మధనపడుతున్నారుట.

ఆ పోస్ట్ ఓకే …

ఇదిలా ఉండగా విశాఖ కాకినాడి కారిడార్ ప్రాజెక్ట్ చైర్ పర్సన్ పదవిని వైసీపీ నేత వెంకటరావు సతీమణి లక్ష్మికి తాజాగా ప్రభుత్వం ఇచ్చింది. ఇది మంచి పదవే. కీలకమైన హోదావే. అయితే ఈ పదవితోనే సరా అన్న మాట చొక్కాకుల వర్గీయులలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని వెంకటరావు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. దాని కోసం ఆయన తెర వెనక కసరత్తు కూడా చేసుకుంటున్నారు. దాంతో ఆయన ఎమ్మెల్యే టికెట్టే అడగాలని కూడా అనుకున్నారు. కనేఎ జగన్ అనూహ్యంగా ఆ కుటుంబానికి పదవి ఇచ్చారు. దాంతో ఈ పదవితో పెదవి మూసేస్తున్నారా అన్నదే డౌట్ ట.

ఖాళీ లేదుగా…?

మరో వైపు చూస్తే విశాఖ ఉత్తరం కెకె రాజుకు రిజర్వ్ అయిపోయింది. పెందుర్తి నుంచి పోటీ చేద్దామనుకుంటే అక్కడ ఆల్ రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే యువ నేత అదీప్ రాజు ఉన్నారు. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు. పైగా మంచి ఇమేజ్ ఉంది. ఆయన్ని కాదని చొక్కాకులకు అక్కడ టికెట్ దక్కదు. దాంతో చొక్కాకులకు వచ్చేసారి కూడా టికెట్ హుళక్కేనని అంటున్నారు. అందువల్లనే ఈ పదవి ఇచ్చి ఎంజాయ్ చేయమన్నారని వైసీపీ వర్గాల మాట. దాంతో ఆయన వర్గం నిరాశకు లోనవుతోంది. ఇది ఒక్క చొక్కాకుల సమస్య మాత్రమే కాదు, అందరిదీనూ. చాలా మంది నేతలు ఇలాగే సతమతమవుతున్నారు. మరి జగన్ మార్క్ పాలిటిక్స్ లో ఏమైనా అద్భుతాలు జరగకపోతాయా అని ఆశావహులు ఎదురుచూడడమే ఇక మిగిలింది.

Tags:    

Similar News