రాజీనామాకు రెడీగా ఉన్నా జగనే బ్రేక్ వేస్తున్నారా ?
టీడీపీ నుంచి వచ్చి.. వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ? అటు టీడీపీలో విలువ లేదు. ఇటు.. వైసీపీ నేతలు కూడా ఒకరిద్దరు తప్ప [more]
టీడీపీ నుంచి వచ్చి.. వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ? అటు టీడీపీలో విలువ లేదు. ఇటు.. వైసీపీ నేతలు కూడా ఒకరిద్దరు తప్ప [more]
టీడీపీ నుంచి వచ్చి.. వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ? అటు టీడీపీలో విలువ లేదు. ఇటు.. వైసీపీ నేతలు కూడా ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు ఆ ఎమ్మెల్యేలను దూరం పెడుతున్నారు. ఎవరూ పలకరించడం కూడా లేదు. ఇటు నియోజకవర్గాల్లో వారికి వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. మరోవైపు వారితో పాటు పార్టీ మారిన నేతల్లో చాలా మంది ఇప్పటికీ టీడీపీతోనే టచ్‌లో ఉన్నారు. దీంతో వారు రాజకీయంగా తీవ్ర సంకట స్థితిలో ఉన్నారు. అటు వైసీపీ – ఇటు టీడీపీ ఎటూ కాకుండా పోయారు. మరి ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి ? మరో మూడేళ్లపాటు ఇలా సర్దుకుపోవాల్సిం దేనా ? లేక.. ఏమైనా గుర్తింపు ఉంటుందా ? అనేది ఆసక్తిగా మారింది. కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు జిల్లా వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ జిల్లాకు చెందిన వెస్ట్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు వైసీపీకి అనుకూలంగా మారిపోయారు.
ఈ ఇద్దరు మాత్రం…?
వీరిలో ఒక్క కరణం బలరాం మాత్రం.. అనధికారంగా చక్రం తిప్పుతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలతో ఆయనకు రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ.. తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. గతంలో జగన్‌తో ఉన్న పరిచయాలు… ఇటు జిల్లాకే చెందిన వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండదండలు ఆయనకు కలిసి వస్తున్నాయి. వల్లభనేని వంశీ కూడా మంత్రి కొడాలి నాని సన్నిహితుడు కావడంతో నెట్టుకురాగలుగుతున్నారు. కానీ మిగిలిన ఇద్దరు మాత్రం పుంజుకోలేక పోతున్నారు.
టీడీపీ క్యాడర్ దూరం…
వారు వైసీపీ సానుభూతిపరులుగా ఉన్నా.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. స్థానికంగా ఏమీ సాధించలేని పరిస్థితి నెలకొంది. పార్టీకి అనుకూలంగా మారారనే చెడ్డపేరుతోపాటు.. అధికార పార్టీ నేతల నుంచి కనీసం పలకరింపులు కూడా దక్కడం లేదు. ఏదైనా ఉంటే.. ముఖ్యమంత్రి జగన్‌తోనే చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ముఖ్యమంత్రి ఉన్న బిజీ కారణంగా.. వీరికి అప్పాయింట్‌మెంట్లు కూడా లభించడం లేదు. ఇక, వంశీ విషయం కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మంత్రికొడాలినాని, పేర్ని నాని వంటి వారితో ఆయనకు ఉన్న సఖ్యత కారణంగా.. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నా.. వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకుంటున్నారు. జగన్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు.
రాజీనామా చేసేందుకు..?
అయితే.. వీరు తమ పదవులకు రాజీనామా చేసేందుకు రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు ముందు… ఆ తర్వాత వీరు తమ పదవులకు రాజీనామాలు చేసి వైసీపీ సింబల్ మీద గెలిచేందుకు రెడీ అని చెప్పినా కూడా వీరిని పట్టించుకోలేదు. ఇక ఇప్పుడున్న పరిస్థితిలో వీరితో రాజీనామా చేయించేందుకు జగన్ రెడీగా లేరని అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి రీజనేమై ఉంటుందనేది ఆసక్తిగా ఉన్నా.. పార్టీ మారిన వారు పెట్టుకున్న ఆశలు మాత్రం ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఏదేమైనా ఎన్నో ఆశలతో పార్టీ మారిన నేతలు అధికార పార్టీలో హవా చెలాయిద్దామనుకున్నా కుదిరేలా లేదు.