మంత్రుల మ‌ధ్య క‌రోనా వార్‌.. అంద‌రూ గ‌ప్‌చుప్‌…!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా.. ప్రజ‌లు భౌతిక దూరాన్ని పాటించాలంటూ.. ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. అంతే కాదు.. ప్రజ‌లు ఎక్కడ గాడిత‌ప్పుతారోన‌ని లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్రజ‌లు త‌ప్పనిస‌రి ప‌రిస్థితి [more]

Update: 2020-04-15 02:00 GMT

క‌రోనా వైర‌స్ కార‌ణంగా.. ప్రజ‌లు భౌతిక దూరాన్ని పాటించాలంటూ.. ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. అంతే కాదు.. ప్రజ‌లు ఎక్కడ గాడిత‌ప్పుతారోన‌ని లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్రజ‌లు త‌ప్పనిస‌రి ప‌రిస్థితి అయి ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. మ‌రి ప్రజ‌ల‌ను స‌మ‌తుల్యం చేయ‌డంలోను, ప్రజ‌ల స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డంలోను, క‌రోనా నేప‌థ్యంలో వారు ప‌డుతున్న సాధ‌క బాధ‌ల‌ను ఆల‌కించ‌డంలోనూ ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు ఏం చేస్తున్నారు ? ప్రజ‌ల మ‌ధ్యకు వ‌స్తున్నారా ? పోనీ క‌రోనా ఎఫెక్ట్‌తో వారు రాక‌పోయినా.. తమ కార్యాల‌యాల నుంచైనా ప‌నులు చేస్తున్నారా ? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు.

జనాలకు దూరంగా….

ప్రజ‌ల క‌న్నా ఎక్కువ‌గా మంత్రులే క‌రోనా ఎఫెక్ట్‌తో ఎంతెంత దూరం అంటే.. చాలా చాలా దూరం అనేలా ప్రజ‌ల నుంచి దూరంగా ఉంటున్నారు. ప్రజ‌ల మ‌ధ్యకు రాక‌పోయినా.. తమ త‌మ కార్యాల‌యాల నుంచి ప‌నులు చేసే వీలున్నా.. లేక ఇంటి నుంచి ప‌నులు చేసే అవ‌కాశం ఉన్నా.. ప్రజ‌ల గోడు ప‌ట్టించుకునే అవ‌కాశం ఉన్నా.. ఇప్పుడు మంత్రుల‌కు మాత్రం తీరిక లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో మొత్తం సీఎంతో క‌లిపి ఉన్న పాతిక మంది మంత్రుల్లో కేవ‌లం ఐదుగురు మాత్రమే యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ముఖ్యమైన పోర్ట్ ఫోలియో నిర్వ‌హిస్తున్న మంత్రులు త‌మ కుటుంబాలతో క‌లిసి ఏకాంత వాసాల్లో ఎంజాయ్ చేస్తు న్నారు త‌ప్ప.. ప్రజ‌ల‌ను ఎక్కడా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇంటికే పరిమితమయి….

కుర‌సాల క‌న్నబాబు, బొత్స స‌త్యనారాయ‌ణ‌.. ఇక త‌ప్పద‌న్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని, విశాఖ‌లో అవంతి శ్రీనివాస్ మిన‌హా ఎవ్వరూ యాక్టివ్‌గా ఉన్నట్టు లేరు. ఇక మిగిలిన వారిలో హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌పై తీవ్ర విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ప్రజ‌ల‌ను పోలీసులు లాఠీల‌తో కుళ్ల బొడుస్తున్నా.. ఆమె ఎక్కడా పెద‌వి విప్పడం లేదు. లాక్‌డౌన్ వంక‌తో పోలీసులు వీర‌ప్రతాపం చూపిస్తున్నా.. ఆమె ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఇక‌, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి వ‌నిత కూడా ఇంటికే ప‌రిమి త‌మ‌య్యారు. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు సంబంధించి ఆమె ఇంటి నుంచి ప‌ర్యవేక్షించే అవ‌కాశం ఉన్నా ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

అప్పుడప్పుడూ కన్పిస్తూ…..

అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీవాణి కూడా అదే విధంగా వ్యవ‌హరిస్తున్నారు. మ‌హిళ‌ల్లో డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఇంత జ‌రుగుతున్నా యాక్టివ్‌గా ఉండ‌డం లేద‌న్న చ‌ర్చలే న‌డుస్తున్నాయి. ఇక‌, మంత్రుల్లో గౌతం రెడ్డి కూడా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అనిల్ కుమార్ యాద‌వ్ గ‌తంలో హ‌డావిడి చేసినా ఇప్పుడు అంత స్పీడ్‌గా లేరు. కొడాలి నాని ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి త‌న‌కు అల‌వాటైన‌ట్టుగా చంద్రబాబును తిట్టి మ‌మః అనిపించేశారు. ఇక మిగిలిన వారి గురించి మాట్లాడుకోవ‌డానికేం లేదు. దీంతో ప్రజ‌లు త‌మ క‌న్నా మంత్రుల‌కే క‌రోనా ఫీవ‌ర్ ప‌ట్టుకుంద‌ని సోష‌ల్ మీడియాలో స‌టైర్లు కుమ్మేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News