జాతకం మొత్తం మారిపోయిందిగా?

విశాఖపట్నం నేడు ఏపీకి పరిపాలనా రాజధాని అయింది. దాంతో చాలా కాలానికి ఈ మహానగరానికి ఒక అధికారిక హోదా వచ్చింది. నిజానికి విశాఖ సామాన్యమైన నగరం కాదు, [more]

Update: 2020-08-07 03:30 GMT

విశాఖపట్నం నేడు ఏపీకి పరిపాలనా రాజధాని అయింది. దాంతో చాలా కాలానికి ఈ మహానగరానికి ఒక అధికారిక హోదా వచ్చింది. నిజానికి విశాఖ సామాన్యమైన నగరం కాదు, ఎంతో చరిత్ర ఉంది. అమరావతిలాగానే పురాతమైన నగరంగా, బౌద్ధులు ఆరాధించిన ప్రాంతంగా విశాఖ పేరు తెచ్చుకుంది. విశాఖ ఇవాళ రాజధాని అని కాదు, క్రీస్తుపూర్వం 5వ శాతాబ్దంలో విశాఖ రాజధానిగా వర్ధిల్లింది అని చరిత్ర చెబుతోంది. అప్పట్లో బౌద్ధులు పాలించిన ఈ భూభాగానికి విశాఖ రాజసం కలిగిన నగరంగా కనిపించి తమ క్యాపిటల్ గా చేసుకున్నారుట.

నాడే అలా వెలిగి…

ఇవన్నీ పక్కన పెడితే ఏపీ రాష్ట్రంగా మద్రాస్ నుంచి విడిపోయాక కూడా విశాఖను రాజధానిగా చేద్దామనుకున్నారు. ఆనాడు కేవలం పదకొండు జిల్లాలు మాత్రమే ఏపీలో ఉండేవి. అయితే చిత్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణా ఏపీలో విలీనం కావడంతో అప్పటికే అభివృధ్ధి చెందిన భాగ్యనగరమే అసలైన రాజధాని అని భావించి అంతా అక్కడికి తరలిపోయారు. ఇక విశాఖ చుట్టూ ఇంత కధ జరిగినపుడు ఒకటి అర్ధమవుతుంది. కాలాలు మారినా కూడా విశాఖకు రాజధాని హోదా వుందని నాటి నుంచి నేటి వరకూ అంతా గుర్తించారని, విశాఖను రాజధాని చేయలన్న సంకల్పం మాత్రం ఒక్క జగన్ కే కలగడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. నిజంగా విశాఖ రాజధాని కల సాకారం కాదని అంతా భావించారు. అమారవతి రాజధాని కాగానే విశాఖ ఉసూరుమంది, కల చెదిరింది అని సరిపెట్టుకుంది.

ముంబైకి ధీటుగా …..

కానీ గిర్రున అయిదేళ్ల కాలం తిరిగేసరికి ఎన్నో మార్పులు వచ్చాయి. జగన్ అధికారంలోకి రావడంతో విశాఖ జాతకం కూడా మారిపోయింది. విశాఖను జగన్ రాజధాని చేసి నుదుట కుంకుమ‌ దిద్దారు. విశాఖ ఇపుడే మేటి నగరం. ఇక రాజధాని అయ్యాక మరింతగా విస్తరిస్తుందని అంతా భావిస్తున్నారు. ముంబైలో వెస్ట్ నావల్ కమాండ్ ఉంటే విశాఖలో ఈస్ట్ నావల్ కమాండ్ ఉంది. ఆ విధంగా దేశ ఆర్ధిక రాజధానికి ధీటుగా దక్షిణాన రక్షణ‌ పరంగా విశాఖ ఉంది. అంతే కాదు, నాలుగు రకాలైన రవాణా మార్గాలు ఉన్నాయి. జల, వాయు, రైల్, రోడ్డు రవాణ సదుపాయాల్లోనూ ముంబైకి ధీటుగా విశాఖ నిలిచింది.

దూకుడుగా ప్రగతి…..

ఇపుడు ఏపీకే రాజధాని అయింది. రానున్న రోజుల్లో అంటే మరో పది పదిహేనేళ్ళకైనా విశాఖకు దేశ రెండో రాజధాని అయ్యేంత అర్హత ఉందని మేధావులు నిపుణులు అంటున్నారు. విశాఖ అభివ్రుధ్ధిని ఎవరూ ఆపలేరని కూడా చెబుతున్నారు. ఇదే విషయం మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేశ రెండో రాజధాని అయ్యే అద్రుష్టం అన్ని విధాలుగా విశాఖకు మాత్రమే ఉందని అంటున్నారు. ఏమో అనూహ్యంగా ఇవాళ ఏపీకి రాజధాని అయింది. రేపటి రోజున దేశానికి కూడా అవుతుందేమో ఎవరు చెప్పగలరు, మొత్తానికి విశాఖ జైత్ర యాత్ర మొదలైంది అని చెప్పాల్సిందే.

Tags:    

Similar News