ఆఫర్లు…డిస్కౌంట్లతో గట్టెక్కాలనేనా..?
వచ్చే ఏడాది ఎన్నికలు. పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. కాంగ్రెస్ కలసి వెళదామంటే ససేమిరా అంటోంది. భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. ఇదీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ [more]
వచ్చే ఏడాది ఎన్నికలు. పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. కాంగ్రెస్ కలసి వెళదామంటే ససేమిరా అంటోంది. భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. ఇదీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ [more]
వచ్చే ఏడాది ఎన్నికలు. పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. కాంగ్రెస్ కలసి వెళదామంటే ససేమిరా అంటోంది. భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. ఇదీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో లా లేదే……
ఢిల్లీ అసెంబ్లీకి 2020లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ 67 స్థానాల్లో గెలిచింది. అప్పటి పరిస్థితులు వేరు. కేజ్రీవాల్ పై నమ్మకం ఎక్కువగా ఉండేది. పార్టీలో కూడా నేతలందరూ కలసి కట్టుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ఎంతో మంది నేతలు అరవింద్ కేజ్రీవాల్ పై బురద జల్లుతూ పార్టీని వీడారు. మరోవైపు ప్రధాన ఓటు బ్యాంకుగా భావించిన వర్గాలన్నీ క్రమంగా దూరమవుతుండటం అరవింద్ కేజ్రీవాల్ ను ఆందోళనకు గురిచేస్తుంది.
లోక్ సభ ఎన్నికల్లో….
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలో ఏడు పార్లమెంటు స్థానాలుంటే ఒక్క సీటును కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకోలేకపోయింది. పైగా ఆందోళ కల్గించే విషయం ఏంటంటే…? ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడం. దీనికి కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకు అయిన ముస్లింలను ఆకర్షించిందని, అందువల్లే మూడోస్థానానికి పడిపోయామని అరవింద్ కేజ్రీవాల్ సర్ది చెప్పుకున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉండదన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ సొంతంగానే బలపడాలని కోరుకుంటున్నారు.
కాంగ్రెస్ కలసి రాకున్నా…..
షీలాదీక్షిత్ మరణంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి వస్తుందన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచన. లోక్ సభ ఎన్నికల్లో పొత్తుకు షీలానే అడ్డుపడ్డారన్నది అరవింద్ కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. అయితే కాంగ్రెస్ కలసి వచ్చినా రాకున్నా ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఢిల్లీ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆఫర్ ఇచ్చిన కేజ్రీవాల్ తాజాగా 200 యూనిట్లు విద్యుత్తును వినియోగించే వారందరికీ ఉచితంగానే విద్యుత్తును అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. 201 నుంచి 400 లోపు యూనిట్లు ఉంటే యాభై శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్. ఇలా ఆఫర్లు, డిస్కౌంట్లతోనైనా గట్టెక్కాలన్నది ఆయన ఆలోచన. వర్క్ అవుట్ అవుతుందో? లేదో? చూడాలి.