అచ్చం జగన్ టైపులోనే?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందు వరసలో ఉంది. ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ [more]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందు వరసలో ఉంది. ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ [more]
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందు వరసలో ఉంది. ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థులను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిలు వచ్చే నెల 8వ తేదీన జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశముంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. అజెండాలను సిద్ధం చేసుకున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఒకేసారి 70 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడం విశేషం.
ఒకేసారి అందరినీ…..
ఎక్కడైనా పార్టీలో అసంతృప్తులు తలెత్తకుండా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించడం చూస్తుంటాం. కానీ ఏపీలో జగన్ తరహాలోనే అరవింద్ కేజ్రీవాల్ సయితం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ 175 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి సంచలనం కల్గించారు. ఇప్పుడు అదే రీతిలో కేజ్రీవాల్ సయితం 70 మందితో ఒకే జాబితాను విడుదల చేసి తనకు స్పష్టత ఉందని నిరూపించుకున్నారు.
అసమ్మతిని పక్కన పెట్టి…..
ముక్కోణపు పోటీలో ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడే అవకాశముందని సర్వేలు చెబుతుండటంతో అరవింద్ కేజ్రీవాల్ దూకుడు మీద ఉన్నారు. గత ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాలు గెలిచినా పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తులు చెలరేగాయి. కొందరు పార్టీని విడిచి వెళ్లగా, మరికొందరు పార్టీలోనే ఉండి అసమ్మతి గళాన్ని విన్పించారు. ఈసారి టిక్కెట్ల కేటాయింపులో నాయకత్వంపై నమ్మకం ఉన్న వారినే అరవింద్ కేజ్రీవాల్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
పీకే వ్యూహరచనతో…..
గత ఎన్నికల్లో గెలిచిన 67 మందిలో పదిహేను మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అరవింద్ కేజ్రీవాల్ టిక్కెట్ నిరాకరించారు. వీరిస్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాలనే కేజ్రీవాల్ తిరిగి కేటాయించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు సహకరించలేదని, అందుకే తాను అనుకున్న రీతిలో అభివృద్ధిచేపట్టలేకపోయానని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏపీలోనూ వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి విజయాన్ని సాధించి పెట్టారు. అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.