మళ్లీ ఆయనేనట
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్నికయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. ఇప్టటి వరకూ జరిపిన అన్ని సర్వేల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ వైపే విజయం ఉన్నట్లు తేలింది. [more]
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్నికయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. ఇప్టటి వరకూ జరిపిన అన్ని సర్వేల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ వైపే విజయం ఉన్నట్లు తేలింది. [more]
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్నికయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. ఇప్టటి వరకూ జరిపిన అన్ని సర్వేల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ వైపే విజయం ఉన్నట్లు తేలింది. ఢిల్లీ ఎన్నికలు ఈనెల 8వ తేదీన జరగనున్నాయి. ఇప్పటికే పోటా పోటీగా ప్రచారాన్ని నిర్వహించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్యనే పోరు ఉండటం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఇక్కడ మూడో స్థానంలో ఉన్నట్లు దాదాపుగా తేలింది.
స్థానిక సమస్యలపైనే…..
ఢిల్లీ ఎన్నికలు పూర్తిగా రాష్ట్ర సమస్యల ఆధారంగానే జరగనున్నాయి. జాతీయ స్థాయి అంశాలను ఢిల్లీ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గత ఐదేళ్లుగా తాను చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను విజయం వైపు నడిపిస్తాయని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు ఆయన ప్రత్యర్థులపై స్వల్పంగానే విమర్శలు చేస్తూ తాను చేసిన, చేయబోయ పనుల గురించే ఎక్కువగా ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు.
గ్యారంటీ కార్డుతో…
అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే గ్యారంటీ కార్డును విడుదల చేసింది. ఢిల్లీలో తాగునీరు, విద్యుత్తు సదుపాయంతో పాటు మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే ఢిల్లీ కాలుష్యం పై కూడా తాను సత్వర చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో 67 స్థానాలను సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఆ సంఖ్యలో కాకపోయినా కనీసం యాభై స్థానాలను సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
సంతృప్తి శాతం….
కేజ్రీవాల్ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది. హైదరాబాద్ కు చెందిన పీపుల్స్ పల్స్ సర్వేలో కూడా పేద, మధ్య తరగతి ప్రజలు కేజ్రీవాల్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తేలింది. కేజ్రీవాల్ సంక్షేమ పథకాల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబంలో ఆదా పెరిగిందని సర్వేలో తేలింది. జాతీయ అంశాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఢిల్లీ ఎన్నికలలో మళ్లీ విజయం సాధిస్తారన్న అంచనాలు ఉన్నాయి.