ఊహించిందే.. కండిషన్లు కలవరపెడుతున్నాయా?
తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూటమిలోని పార్టీల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. కొత్త పార్టీలు వస్తుండటంతో చిన్నా చితకా పార్టీలు ఇప్పుడున్న కూటమిలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. కూటమికి [more]
తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూటమిలోని పార్టీల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. కొత్త పార్టీలు వస్తుండటంతో చిన్నా చితకా పార్టీలు ఇప్పుడున్న కూటమిలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. కూటమికి [more]
తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూటమిలోని పార్టీల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. కొత్త పార్టీలు వస్తుండటంతో చిన్నా చితకా పార్టీలు ఇప్పుడున్న కూటమిలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీకి షరతులు విధిస్తున్నాయి. దీంతో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఎన్నికలకు ముందే తలలు పట్టుకుంటున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు ఈ కష్టాలు కొంచెం ఎక్కువనే చెప్పాలి.
పదేళ్ల నుంచి అధికారంలో…..
అసలే పదేళ్ల నుంచి అన్నాడీఎంకే అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. దీనికి తోడు జయలలిత లాంటి చరిష్మా కలిగిన నేత లేరు. మరోవైపు శశికళ జైలు నుంచి విడుదలయి వస్తున్నారు. ఈ సమస్యలన్నింటిని పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు మాత్రమే పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకే కూటిమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగనుంది. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే, డీఎండీకే, బీజేపీలు ఉన్నాయి.
డీఎండీకే కూడా….
ఈ కూటమిలోని బీజేపీకి తమిళనాడులో పెద్దగా బలం లేదు. అది సొంతంగా గెలిచే స్థానమూ లేదు. మరో పార్టీ డీఎండీకే. దీనికి కెప్టెన్ విజయకాంత్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనకు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ రజనీకాంత్ పార్టీ కూడా వస్తుండటంతో డీఎండీకే ఇంకా ఏ కూటమిలోకి వెళ్లాలన్నది నిర్ణయించుకోలేదు. ఒకవేళ అన్నాడీఎంకే కూటమిలో ఉంటే ఎక్కువ స్థానాలను కోరే అవకాశముంది.
షరతులు పెడుతూ…..
మరోవైపు పీఎంకే కూడా ఈ కూటమిలో బలమైన పార్టీయే. తమిళనాడు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ప్రభావం చూపనున్న వన్నియార్లు ఈ పార్టీకి వెన్నుముక. తమిళనాడులోని ఉత్తరాది జిల్లాల్లో దీనికి పట్టుంది. పీఎంకే అధినేత రాందాస్ మాత్రం తమకు ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. అందుకు డీఎండీకే, బీజేపీ అంగీకరించే పరిస్థితి లేదు. దీంతో పీఎంకే రజనీకాంత్ వెంట నడిచే అవకాశముందని చెబుతున్నారు. అయితే బలమైన పీఎంకే ను వదులుకోకూడదని అన్నాడీఎంకే పీఎంకే తో చర్చలు జరుపుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.