ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వరా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఆయన ఇటీవల ఉత్తర్ [more]

Update: 2021-01-23 17:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్లలో జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఆయన ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించి పార్టీ నేతలతో చర్చించారు. ఉత్తర్ ప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడ గెలిస్తే ఢిల్లీ పీఠం దక్కినట్లేనని అన్ని రాజకీయ పార్టీలూ భావిస్తాయి. అందుకే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే ఏ ఎన్నికలనైనా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి.

రానున్న ఎన్నికల్లో…..

రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేయనుంది. సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో కలసి తాము ఎన్నికల్లో పోటీ చేస్తునట్లు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో గెలిచిన ఊపు మీద ఉన్న అసుదుద్దీన్ ఒవైసీ త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ లో పోటీతో దేశంలో మరింత బలపడాలని అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు.

పొత్తు పెట్టుకుని మరీ…..

ఈ నేపథ్యంలో తర్వాత జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ నిర్ణయించారు. గతంలోనూ యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది. అయితే ఫలితం దక్కలేదు. యూపీలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకూ ఉత్తర్ ప్రదేశ్ లో ముస్లిం సామాజికవర్గం కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వైపు మొగ్గు చూపుతూ వస్తుంది. వచ్చే ఎన్నికలలో ఈ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాయి.

బీజేపీకి బీ టీంగా…..

కానీ అసదుద్దీన్ ఒవైసీ తాము కూడా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించడంతో ముస్లిం ఓటు బ్యాంకు ఎటువైపు మరలుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీకి బీ టీం అన్న ఆరోపణలున్నాయి. ఒవైసీ కారణంగానే అనేక చోట్ల బీజేపీకి విజయం లభిస్తుందని అన్ని పక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా అసదుద్దీన్ ఒవైసీ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. తన పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఒవైసీ ప్రభావం సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లపైనే ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News