రెడీ అవుతున్నారటగా

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. అధికారంలో ఉండ‌గా ఉండే ప్ర‌భావం ఓడిపోయిన పార్టీల‌కు పెద్ద‌గా ఉండ‌డం లేదు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఇప్పుడు [more]

Update: 2019-09-19 06:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. అధికారంలో ఉండ‌గా ఉండే ప్ర‌భావం ఓడిపోయిన పార్టీల‌కు పెద్ద‌గా ఉండ‌డం లేదు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప‌రిస్థితిని ఏపీలో టీడీపీ కూడా ఎదుర్కొంటోంది. కీల‌క నాయ‌కులు క‌ట్ట‌క‌ట్టుకుని పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌రో కీల‌క నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. విజయనగరం జిల్లాలో టీడీపీ అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు అన్న ముద్రపడి పోయింది. ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదంగా భాసిల్లింది.

టీడీపీలోనే ఉన్నా….

కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా జ‌న‌తా పార్టీతో ప్రారంభ‌మైన అశోక్ గజపతిరాజు కుటుంబ రాజ‌కీయాలు టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైంది. అడుగడుగునా నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీపరంగా వ్యూహరచన కూడా కొరవడింది. మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ఈ అంశాలే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చాయని చెప్పాలి. జనంలో కలిసిపోయి.. దూకుడుగా వ్యవహరించే ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా లేకపోవటం టీడీపీకి మైనస్‌గా మారింది.

కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు…..

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేయడంలో గానీ, ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి అధికారపక్ష తప్పిదాలను ఎండగట్టడంలో గానీ జిల్లా టీడీపీ నేతలు విఫలమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారం తమదేనన్న అతి విశ్వాసం నిలువునా ముంచినా.. ఇప్పటికీ జిల్లా టీడీపీ నేతలు కళ్లు తెరవలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తు కార్యాచరణపై వారిలో ఆలోచనే లేదట.పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక విషయంలోనే అశోక్ గజపతిరాజు పెద్దతప్పు చేశారన్న భావన స్థానిక నాయకు ల్లో ఉంది. “తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అన్న చందంగా అశోక్ గజపతిరాజు వ్యవహరించటమే పార్టీ ఈ పరాజయానికి మూల కారణం” అని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. అశోక్‌ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నన్నాళ్లు.. “అయామ్ సెంట్రల్” అనే వారు! తద్వారా జిల్లా రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పటికీ అదే తీరుని కొనసాగిస్తున్నారన్నది తమ్ముళ్ల అభిప్రాయం.

పార్టీకి దూరంగా…..

ఆయ‌న అధికారంలో ఉన్నా.. లేక‌పోయినా అశోక్ గజపతిరాజును క‌లిసేందుకు సామాన్య కార్య‌క‌ర్త‌ల‌కు గ‌గ‌న‌మే అన్న‌ట్టుగా ఉండేది. ఈ ఎన్నికల్లో ఎంపీగా అశోక్ గజపతిరాజు ‌, ఎమ్మెల్యేగా ఆయ‌న కుమార్తె ఇద్ద‌రూ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుండి ప్రజలకే కాదు.. పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే, ఆయ‌న పూర్తిగా పార్టీకి బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

బీజేపీ నేతలతో….

పాలిటిక్స్‌లో ఆయ‌న‌కు క్లీన్ ఇమేజ్ ఉన్నా ప్ర‌స్తుతం అశోక్ గజపతిరాజు ఏదో ఒక ప‌ద‌వి కోరుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. త‌న‌కు పెద్ద‌గా సంపాయించుకోవాల్సిన అవ‌స‌రం లేక పోయినా.. ఏదో ఒక ప‌ద‌వి ఆయ‌న‌ను వ‌రించాల‌ని కోరుకున్నారు. కానీ, ఇప్పుడు క‌నుచూపు మేర‌లో టీడీపీ ఎదిగే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో అశోక్ గజపతిరాజు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకురెడీ అవుతున్నార‌ని అంటున్నారు. బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం సైతం ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు కొంద‌రిని పుర‌మాయించిందంటున్నారు. మ‌రి అశోక్ గజపతిరాజు పొలిటిక‌ల్ రూటు ఎటు ట‌ర్న్ అవుతుందో ? చూడాలి. ఇక ఇదే జిల్లాకు చెందిన బొబ్బిలి రాజుల‌తో పాటు మాజీ మంత్రుల కుటుంబాల‌కు చెందిన వారితోనూ బీజేపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News