రాజు గారు కత్తి పట్టుకున్నారా…?
రాజులకు కత్తులు పట్టడం, యుద్ధాలు చేయడం కొత్త కాదు. అయితే సమరరంగంలోకి ఎపుడు వెళ్లాలి. ప్రత్యర్ధులను ఎలా చిత్తు చేయాలి అన్న దాని మీద కూడా వారికి [more]
రాజులకు కత్తులు పట్టడం, యుద్ధాలు చేయడం కొత్త కాదు. అయితే సమరరంగంలోకి ఎపుడు వెళ్లాలి. ప్రత్యర్ధులను ఎలా చిత్తు చేయాలి అన్న దాని మీద కూడా వారికి [more]
రాజులకు కత్తులు పట్టడం, యుద్ధాలు చేయడం కొత్త కాదు. అయితే సమరరంగంలోకి ఎపుడు వెళ్లాలి. ప్రత్యర్ధులను ఎలా చిత్తు చేయాలి అన్న దాని మీద కూడా వారికి ఒక వ్యూహం ఉంటుంది. మరి ఘనత వహించిన సంస్థానాధీశుడైన పూసపాటి వారి వారసుడు అశోక్ గజపతిరాజుకు ఇవన్నీ తెలియవు అని అనుకోలగరా. అందుకే ఆయన కావాల్సినంత టైమ్ ఇచ్చి చూశారు. సొంత పార్టీలో ప్రత్యర్ధులు తన సహనానికి పరీక్ష పెడుతున్నా కూడా ఓపిక పట్టారు. ఇపుడు మాత్రం ఇక లాభం లేదనుకుని ఒక్కసారిగా జూలు విదిల్చారు.
బాబుతోనే ఢీ ….
అశోక్ గజపతిరాజు లాంటి బిగ్ షాట్ నే విజయనగరం జిల్లాలో ఇతర నేతలు ఎదిరిస్తున్నారు. ఆయన్ని కాదని సొంత ఆఫీస్ పెట్టేశారు. ఇక తమకు తిరుగులేదని కూడా భావిస్తున్నారు. ఇవన్నీ కూడా హై కమాండ్ కి చెప్పి చూసినా కూడా ప్రయోజనం లేదు. దాంతో అశోక్ గజపతిరాజు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇపుడు అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశం పెడితే దానికే డుమ్మా కొట్టేశారు. తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు పరిషత్ ఎన్నికల బహిష్కరణ సరైన నిర్ణయం కాదని కూడా కుండబద్ధలు కొట్టారు.
ధీటైన నేతగా…?
అశోక్ గజపతిరాజు చంద్రబాబుకు సరిసమానంగా రాణించిన నాయకుడు. ఆయన కూడా 1978లో తొలిసారి జనతా పార్టీ ద్వారా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫార్టీ యియర్స్ పాలిటిక్స్ ఆయనది కూడా. తన మొత్తం పొలిటికల్ కెరీర్ లో రెండు సార్లు తప్ప అన్నీ విజయాలే నమోదు చేసుకున్న నేతగా కూడా కనిపిస్తారు. మచ్చుకైనా అవినీతి మచ్చ లేని అశోక్ గజపతిరాజు ముక్కుసూటిగా ఉంటారు. ఆయనకు గతంలో చంద్రబాబు ఎంతో గౌరవం ఇచ్చేవారు అని చెబుతారు. ఇటీవల కాలంలో మాత్రం ఆయన్ని పక్కన పెట్టేసే రాజకీయాలకు బాబు తెరతీయడం కూడా రాజు గారికి బాగా కోపం తెప్పిస్తొందిట.
ఆప్షన్లు ఉన్నాయా…?
అశోక్ గజపతిరాజు తన రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదు అని అభిమానులు అంటారు. ఆయనని కేవలం సామాజికకోణం నుంచి చూడడం కూడా తప్పు అని అంటున్నారు. ఆయన క్షత్రియ సామాజికవర్గానికి చెందినా కూడా బీసీలు ఇతర వర్గాలు ఆయన్ని ఆరాధించాయి. అభిమానించాయి. కేవలం వెన్నుపోటు, సొంత పార్టీ నేతల కుట్రల ఫలితంగా ఆయన ఓడారు తప్ప జనాభిమానం లేక కాదు అని కూడా చెబుతారు. కానీ చంద్రబాబు మాత్రం సామాజిక కోణం నుంచి చూస్తూ రాజును దూరం పెడుతున్నారు అంటున్నారు. దీంతో పెద్దాయన తెగ వేదన చెందుతున్నారని టాక్. మరి టీడీపీని కాదనుకుంటే ఆయన ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి అన్నది కూడా ప్రశ్నగా ఉంది. బీజేపీ పెద్దలకు ఆయన పట్ల మంచి అభిప్రాయం ఉందని చెబుతారు మరి అశోక్ గజపతిరాజు లాంటి నేత వస్తే తప్పకుండా అక్కున చేర్చుకుంటారు అన్న మాట కూడా ఉంది. అయితే అశోక్ మాత్రం టీడీపీని వీడే యోచన చేయరు అని కూడా ఉంది. తన కుమార్తెకు వారసత్వం దక్కాలన్నదే ఆయన పట్టు. మరి బాబు దాన్ని నెగ్గించే దాని బట్టే అశోక్ గజపతిరాజు ఫ్యూచర్ పాలిటిక్స్ ఆధారపడి ఉంటుందని టాక్.