అశోక్ పదవికి ముప్పు ఉందా?

అశోక్ గెహ్లాట్ పదవికి ముప్పు ఏర్పడిందా? రాజస్థాన్ లో పిల్లల మరణాలు ఆయన పదవికి ఎసరు తెచ్చి పెడుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రాజస్థాన్ [more]

Update: 2020-01-05 18:29 GMT

అశోక్ గెహ్లాట్ పదవికి ముప్పు ఏర్పడిందా? రాజస్థాన్ లో పిల్లల మరణాలు ఆయన పదవికి ఎసరు తెచ్చి పెడుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు కావస్తోంది. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది. జాతీయ రాజకీయాల్లో ఉన్న అశోక్ గెహ్లాట్ ను తిరిగి రాజస్థాన్ కు పంపింది. సీనియర్ నేతగా ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని సజావుగా నడుపుతారన్న నమ్మకంతో అప్పట్లో సోనియా గాంధీ సీనియర్లకే ప్రాధాన్యం ఇచ్చారు.

సీనియర్ అని….

నిజానికి రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి అప్పటి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటుగా సచిన్ పైలెట్ వంటి యువనేతలు పార్టీ విజయానికి కృషి చేశారు. సచిన్ పైలెట్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. అప్పట్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండటం, రాహుల్ కు సచిన్ పైలెట్ సన్నిహితుడు కావడంతో ఆయనవైపే మొగ్గు చూపు తారనుకున్నారు. కానీ అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రిని చేసి సచిన్ పైలెట్ ను ఉప ముఖ్యమంత్రిగా అధిష్టానం చేసి ఇద్దరినీ సంతృప్తి పర్చగలిగింది.

పిల్లల మరణాలతో….

ఇప్పుడు రాజస్థాన్ కోటాలోని ఆసుపత్రిలో పసి పిల్లల మరణాలు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశమయ్యాయి. దాదాపు వంద మంది పిల్లలకు పైగానే మరణించడంతో అక్కడ ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. యూపీఏ కూటమిలోని పార్టీలే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానంలో అంతర్మధనం ప్రారంభమయింది. తాజాగా సోనియా గాంధీని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కలసి రాజస్థాన్ పరిస్థితులపై చర్చించారు.

సీఎంను మారుస్తారా?

మరోవైపు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ కూడా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. తాము అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా వైఫల్యాలను గత ప్రభుత్వంపై రుద్దడం సరికాదని ఆయన వ్యాఖ్యానించడం చూస్తే ముఖ్యమంత్రిని నేరుగా లక్ష్యం చేసుకున్నట్లు కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం మార్పు తప్పదని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News