ఒంటిచేత్తోనే గెలిపించారు

తమిళనాడులో ఎన్నికల ఫలితాలను ముందుగా ఊహించిందే. డీఎంకే అధికారంలోకి వస్తుందని అందరి అంచనాలు నిజమయ్యాయి. డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈ విజయం అవసరం. పదేళ్ల పాటు [more]

Update: 2021-05-02 17:30 GMT

తమిళనాడులో ఎన్నికల ఫలితాలను ముందుగా ఊహించిందే. డీఎంకే అధికారంలోకి వస్తుందని అందరి అంచనాలు నిజమయ్యాయి. డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈ విజయం అవసరం. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటంతో ఆయన శ్రమించి ఈ ఎన్నికల్లో పార్టీని విజయం వైపు నడిచారు. అంతా తానొక్కడే అయి నడిపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టారు.

మిత్రపక్షాలను….

స్టాలిన్ అధికారంలోకి రావడంతో డీఎంకే శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. స్టాలిన్ ఊహించినట్లే ఈసారి ఫలితాలు వచ్చాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కూటమిని పటిష్టం చేసుకున్నారు. తన కూటమిలోని పార్టీలను కట్టడి చేయగలిగారు. గత ఎన్నికల్లో మాదిరి ఫలితాలు ఉండకూడదని భావించి మిత్ర పక్షాలకు అతి తక్కువ స్థానాలను కేటాయించారు. ఆ వ్యూహం ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిందన్నారు.

ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుని….

డీఎంకే ఒక్కటే మిత్ర పక్షాలకు సంబంధం లేకుండా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. కరుణానిధి మరణం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు స్టాలిన్ కు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఆయన నాయకత్వానికి పరీక్ష. లోక్ సభ ఎన్నికల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేయడంతో్ ఆయన నాయకత్వంపై నమ్మకం కలిగింది. ఇక ఈ ఎన్నికల్లో గెలుపు అనివార్యం కావడంతో ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు.

రజనీ పార్టీ పెట్టకపోవడం….?

అభ్యర్థుల ఎంపికలోనూ స్టాలిన్ సర్వేల మీదే ఆధారపడ్డారు. ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన సర్వే నివేదికలను అనుసరించే టిక్కెట్ల కేటాయింపు జరిపారు. ఇలా ప్రతి విషయంలోనూ స్టాలిన్ ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపారు. రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడం స్టాలిన్ కు కలసి వచ్చిందనే చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా స్టాలిన్ కు కలసి రావడంతోనే విజయం సాధ్యమయింది.

Tags:    

Similar News