ఎన్ఐఏ దూకుడుకు వణుకు మొదలైందా …?

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో [more]

Update: 2019-01-20 05:00 GMT

మాకు సంబంధం ఏమిటి ? ఎయిర్ పోర్ట్ మా పరిధిలో ఉండదు. కేసు దర్యాప్తు వారే చేయాలి అని జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే కేసులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు ఆయన అనుకున్నట్లే కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ ఎంటర్ అయ్యింది. అంతే ఇప్పుడు ప్రభుత్వం తీరు మాత్రం మారిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రాల అధికారంలో వేలుపెడుతుంది అంటూ గగ్గోలు పెడుతుంది టిడిపి. విశాఖ ఎయిర్ పోర్ట్ లో విపక్ష నేత వైఎస్ పై జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పుడు దూకుడుగా సాగుతుంది.

కొందరిలో వణుకు…

వారి దూకుడుకి కొందరిలో వణుకు మొదలైంది. ఈ కేసులో వైసిపి నేతలను సాక్షులుగా విచారించిన ఎన్ఐఏ తదుపరి విచారణకు ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ యజమాని విష్ణువర్ధన్ చౌదరి ని తమ ముందు హాజరు కావాలని కోరింది. ఆయన తన ఆరోగ్యం బాగాలేనందున రెండు రోజులు ఆగి వస్తానని చెప్పడం చర్చనీయాంశం గా మారింది. ఈ కేసు అరకు ఎమ్యెల్యే హత్య కేసులకు సంబంధించి విచారణలు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ విశాఖ కైలాసగిరిపై తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంతో ఈ కేసుల చిక్కుముడి వీడే వరకు ఇక్కడే మకాం ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం.

మళ్ళీ కోర్టు కెక్కిన సర్కార్ …

జగన్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టినప్పటినుంచి ఎపి సర్కార్ అడుగడుగునా వారి చర్యలను అడ్డుకునేందుకే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీస్తుంది. మరో పక్క పోలీసులు సైతం విచారణకు సహకరించకపోవడంతో ఎందుకు వారిలా చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది ప్రచారం కోసమే జగన్ అభిమాని చేశాడని కేసు క్లోజ్ చేసేందుకు ఎపి పోలీసులు ప్రభుత్వ వత్తిడి తో చేశారని హై కోర్ట్ ను ఆశ్రయించిన వైసిపి వాదనకు ఇప్పుడు బలం చేకూరేలా సర్కార్ చర్యలు ఉన్నాయని విపక్ష పార్టీ వేలెత్తి చూపిస్తుంది.

చుక్కెదురవ్వడంతో…..

మరోపక్క ఉగ్రవాద కార్యకలాపాల కేసులు దర్యాప్తు చేసే సంస్థ ఈ కేసు చేపట్టడం ఏమిటంటూ చంద్రబాబు సర్కార్ రాజకీయంగా ఈ అంశాన్ని చర్చకు పెట్టింది. అటు అధికారపక్షం ఇటు విపక్షం రెండు కూడా ఈ వ్యవహారాన్ని ప్రతిష్టగా తీసుకున్నాయి. ఇరు వర్గాలు హై కోర్ట్ చుట్టూ తిరుగుతూ సాగిస్తున్న పోరాటం కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కోర్ట్ లో అడుగడుగునా ఎపి ప్రభుత్వానికి చుక్కెదురౌతున్న నేపథ్యంలో మరోకేసు దాఖలు చేసిన సర్కార్ అభియోగాల పై న్యాయస్థానం ఇచ్చే తీర్పు మరింత ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News