అవంతితో టచ్ లో ఉన్నదెవరంటే…?

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు శాఖాపరంగా ఏ మేరకు పనితీరు ప్రదర్శించారన్నది ముఖ్యమంత్రి జగన్ వేసే మార్కుల బట్టి ఆధారపడిఉంటుంది. అది సరే కానీ [more]

Update: 2019-08-16 03:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు శాఖాపరంగా ఏ మేరకు పనితీరు ప్రదర్శించారన్నది ముఖ్యమంత్రి జగన్ వేసే మార్కుల బట్టి ఆధారపడిఉంటుంది. అది సరే కానీ టీడీపీలో అయిదేళ్ల పాటు అంటకాగి ఎన్నికలకు నెల రోజుల ముందు చేరిన అవంతి శ్రీనివాస్ ని పార్టీలో తీసుకుని గెలిచిన వెంటనే ఏకంగా మంత్రి పదవి ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లా రాజకీయాల్లో బలమైన నేత. పైగా కాపు సామాజికవర్గం మద్దతు దండిగా ఉన్న నాయకుడు. ఇక టీడీపీలో నిన్నటి వరకూ ఉంటూ వచ్చిన అవంతి శ్రీనివాస్ కి అక్కడ గుట్టు మట్లు బాగా తెలుస్తాయి. దాంతో విశాఖ అర్బన్ జిల్లాలో పార్టీ విస్తరణకు సులువు అవుతుందని భావించి జగన్ ఆయన్ని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. దానికి తగినట్లుగానే అవంతి శ్రీనివాస్ జోరు చూపాల్సిన అవసరం కూడా ఉంది.

ఎమ్మెల్యేలతో రాయబేరాలు…..

నిండు అసెంబ్లీ సాక్షిగా జగన్ ఒక మాట చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వారిని వేరొక పార్టీలోకి తీసుకోవాలంటే తప్పనిసరిగా వారు రాజీనామా చేయాలని జగన్ షరతు పెట్టారు. మరి ఆ సంగతి తెలిసి కూడా చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి అవంతి శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నారు. తమను పార్టీలోకి తీసుకునేలా జగన్ ని ఒప్పించాలని కూడా కోరుతున్నారు. ఈ విషయాన్ని అవంతి శ్రీనివాస్ స్వయంగా మీడియాకు చెప్పడంతో ఇపుడు అది విశాఖ రాజకీయాలతో పాటు టీడీపీ శిబిరాన్ని కూడా వణికిస్తోంది. తనతో పది మంది వరకూ ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నారని అవంతి శ్రీనివాస్ చెప్పడం ఇక్కడ విశేషం. ఓ విధంగా అవంతి శ్రీనివాస్ బాంబు పేల్చారనే అనుకోవాలి. ఆ పది మందిని చేర్చుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా అవంతి శ్రీనివాస్ అన్నారు. జగన్ కనుక ఒకే అంటే ఈ పది మందే కాకుండా మొత్తానికి మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ చేస్తారని కూడా మంత్రి అవంతి శ్రీనివాస్ అనడం గమనార్హం. అంటే జగన్ వైసీపీ డోర్లు తీస్తే వచ్చేవారు ఎంతోమంది ఉంటారని, టీడీపీ దుకాణం బంద్ అవుతుందని అవంతి శ్రీనివాస్ చెప్పినట్లైంది.

బాబుకు జగనే రక్ష….

ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఇపుడు వద్దు అనడం వల్లనే బలవంతంగా ఎమ్మెల్యేలు చంద్రబాబుతో ఉంటున్నారని అవంతి శ్రీనివాస్ మాటల బట్టి అర్ధమవుతోంది. ఒకవేళ జగన్ సరేనంటే టీడీపీలో బాబు, ఆయనగారి బావమరిది తప్ప ఎవరూ మిగలరేమోనన్న డౌట్లు కూడా వస్తున్నాయి. అవంతి శ్రీనివాస్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తమ నాయకుడు షరతు పెట్టబట్టి టీడీపీలో బాబుకు ఎమ్మెల్యేలు మిగిలారని సెటైర్లు వేశారు. మరి చంద్రబాబు సీనియారిటీ, దీక్షా దక్షతలు, ఇవన్నీ కూడా ఏ మాత్రం ఎమ్మెల్యేలను కట్టి ఉంచలేకపోతున్నాయన్నమాట. అంతే కాదు. అయిదేళ్ళ పాటు అధికారం అనుభవించాం, పార్టీ అన్నీ మాకు ఇచ్చింది. అందువల్ల నైతిక విలువలు పాటించి అయినా పార్టీలో కొనసాగే వారు ఎవరూ లేరన్నది తేలిపోతోంది. మొత్తానికి ఇదేదో బాబుకు ప్రమాదంగా ఉందంటున్నారు రాజకీయ మేధావులు. ఎల్లకాలం రాజకీయాలు ఒకేలా ఉండవు, రేపటి రోజుల జగన్ మనసు మార్చుకుని ఎమ్మెల్యేలను తీసుకోవాలనుకుంటే అపుడు సైకిల్ పార్టీ ఆఫీస్ గేట్లకు తాళాలు పడడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News