అవంతి దూకుడు పెంచినా.. గుర్తింపు రావడం లేదా ?
మంత్రి అవంతి శ్రీనివాసరావుకు అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు ఆయన.. ఒకింత వెనకబడినా.. ఇప్పుడు అందివచ్చిన వరంగా .. విశాఖ ఉక్కు అంశం కలిసి వచ్చింది. దీంతో [more]
మంత్రి అవంతి శ్రీనివాసరావుకు అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు ఆయన.. ఒకింత వెనకబడినా.. ఇప్పుడు అందివచ్చిన వరంగా .. విశాఖ ఉక్కు అంశం కలిసి వచ్చింది. దీంతో [more]
మంత్రి అవంతి శ్రీనివాసరావుకు అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు ఆయన.. ఒకింత వెనకబడినా.. ఇప్పుడు అందివచ్చిన వరంగా .. విశాఖ ఉక్కు అంశం కలిసి వచ్చింది. దీంతో మంత్రిని అనే భేషజం కూడా పక్కన పెట్టి.. రోడ్డెక్కారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితిలోనూ తరలించేది లేదని.. అవసరమైతే.. ఎంత వరకైనా తాను వ్యక్తిగతంగా అయినా.. పోరాడతానని ప్రకటించారు. ఇక, నిత్యం విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటున్నారు. మీడియాతోనూ మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు దూరంగా ఉన్న వైసీపీ నాయకులను కూడా కలుపుకొని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అవంతి దూకుడు పెంచారనే టాక్ వినిపిస్తోంది.
గుర్తింపు లేకుండా….?
అయితే.. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే అవంతి శ్రీనివాసరావు ఇంత దూకుడు పెంచినా.. అధికారిక ఛానెల్‌గా ఉన్న సాక్షిలో కానీ ఆ పత్రికలో కానీ.. అవంతికి గుర్తింపు లేకుండా పోయిందని అంటున్నారు వైసీపీ నాయకులు. ఓ కీలక నాయకుడి ఆదేశాల మేరకు.. అవంతి వార్తలను పూర్తిగా పక్కన పెడుతున్నారట. అంతేకాదు.. ఆయన ఎంత విజృంభించినా.. స్తానిక నేతలు కూడా అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారు. వస్తాం.. అదిగో ఇదిగో .. అంటూ.. ఫోన్లు చేస్తే.. స్పందిస్తున్నారు కానీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అవంతికి సహకరించడం లేదు. దీంతో అవంతి దూకుడు పెంచినా.. ఆయనకు గుర్తింపు మాత్రం రావడం లేదని చెబుతున్నారు.
రాజీనామా చేయకుండా….?
మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. నామమాత్రంగా అయినా..(స్పీకర్ ఫార్మాట్‌లో కాకపోయినా) తన పదవికి రాజీనామా చేశారు. ఇదిబాగానే వర్కవుట్ అవుతోంది. గంటా రాజీనామా ఒక్కసారిగా హైలెట్ అవ్వడంతో పాటు ఆయన్ను మీడియాలో హీరోను చేసింది. ఇదే సమయంలో విశాఖలో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు మాత్రం పదవిని పట్టుకుని వేలాడుతున్నారని .. గంటా పరోక్షంగా ప్రచారం చేయిస్తున్నారు. విశాక ఉక్కు ఉద్యమ కారులు దీనినే అడుగుతున్నారు. అవంతి శ్రీనివాసరావుకి నిజంగా ఉక్కు పరిశ్రమపై ప్రేమ ఉంటే.. ఖచ్చితంగా ఆయన తన పదవికి రాజీనామా చేయాలి కదా ? ఎందుకు చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇంటా.. బయటా…?
దీంతో ఇంటా బయటా కూడా అవంతి శ్రీనివాసరావుకి సెగ తగులుతోందని అంటున్నారు పరిశీలకులు. అవంతి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నారు. అప్పుడు కూడా ఆయన విశాఖ రైల్వే జోన్ కోసం నిరాహార దీక్షలు చేసినా అప్పుడు హైలెట్ కాలేదు సరికదా ? తమ పార్టీ అధిష్టానమే ఆయన్ను పట్టించుకోలేదు సరికదా ? మా ఆదేశాలు లేకుండా మీరెందుకు నిర్ణయం తీసుకున్నారని చీవాట్లు పెట్టింది. ఉత్తరాంధ్రలో కీలక అంశాల విషయంలో ఆయన ఏదో చేసి హైలెట్ అవుదామనుకున్నా రెండు సార్లు ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాకుండా పోయింది.