ఇంతకీ ఈయన ఓడినట్లా? గెలిచినట్లా ?

వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఎవరికీ లేన్నని బిరుదులు ట్యాగులు తగిలించి మరీ స్వపక్షం విపక్షం కూడా పండుగ చేసుకుంటున్నాయి. అవంతిని వైసీపీలో ఒక వర్గం లైట్ [more]

Update: 2021-09-06 15:30 GMT

వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ఎవరికీ లేన్నని బిరుదులు ట్యాగులు తగిలించి మరీ స్వపక్షం విపక్షం కూడా పండుగ చేసుకుంటున్నాయి. అవంతిని వైసీపీలో ఒక వర్గం లైట్ గా తీసుకుంటోంది. ఆయన మినిస్టర్ అయినా కూడా పెద్దగా ఖాతరు చేయడంలేదు. ఇక్కడ ఎంత దారుణం అంటే తనకు జిల్లా అధికారులు అసలు సహకరించడంలేదని అవంతి ఎంపీ విజయసాయిరెడ్డి ముందు నిలబడి ఫిర్యాదు చేసుకోవడం. అక్కడే అవంతి శ్రీనివాసరావు అధికారం, దర్జా రెండూ పూర్తిగా తేలిపోయాయని వైసీపీలో ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ విషయంలో టీడీపీ అయితే ఏకంగా తాటాకులే కడుతోంది. అవంతి తప్పుకో అంటోంది.

పనిలేని మంత్రా…?

అవంతిని పని లేని మంత్రి, పస లేని మంత్రి, ఉత్సవ విగ్రహం అంటూ టీడీపీ ఘాటుగానే విమర్శలు చేస్తారు. ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం ఒకసారి మంత్రి గిరీని వెలగబట్టిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అయితే అవంతి శ్రీనివాసరావుని మంత్రిగానే గుర్తించడంలేదుట. ఆయన విశాఖకు మంత్రిగా ఉన్నా లేకుండా ఒక్కటే అంటున్నారు. ఆయనకు అధికారాలు లేనపుడు ఆ సీట్లో ఉండడం ఎందుకు అని కూడా లాజిక్ పాయింట్ తీస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు పేరుకు మాత్రమే మంత్రి అని సర్వాధికారి విజయసాయిరెడ్డి అంటూ మరింతగా పరువు తీస్తున్నారు. రెండున్నరేళ్ళలో ఒక్క పని కూడా చేయలేని అవంతి ఎందుకు పదవిలో ఉండడం అంటున్నారు.

ఆయన ఐరన్ లెగ్…

అంతే కాదు టీడీపీ వైసీపీలోని కొందరు నేతలు ఉమ్మడిగా ఐరన్ లెగ్ అంటూ కొత్త బిరుదును అవంతి శ్రీనివాసరావుకి ఇచ్చేశారు.అవంతి ఉన్న పార్టీ బాగుపడిన దాఖలాలు లేవు అంటూ చిట్టా కూడా విప్పుతున్నారు. ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాసరావు ఆ తరువాత కాంగ్రెస్ లో చేరాడని చెబుతున్నారు. ఆ రెండు పార్టీలు ఇపుడు ఏపీలో అంతర్ధానం అయిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక అవంతి టీడీపీలో చేరి ఎంపీ అయ్యారని, తరువాత ఎన్నికల్లో టీడీపీ ఓడిందని, ఇపుడు వైసీపీలో మంత్రిగా అవంతి శ్రీనివాసరావు ఉన్నారు కాబట్టి ఆయన ఐరన్ లెగ్ మహిమ వల్ల వైసీపీ కూడా ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. ఆయన్ని పక్కన పెడితేనే ఏ రాజకీయ పార్టీకైనా ఫ్యూచర్ అని కూడా సత్యం పలుకుతున్నారు.

అవమానాలేనా..?

నిజానికి మంత్రి అనిపించుకున్నారు తప్ప అవంతి శ్రీనివాసరావుకి కలసి వచ్చింది ఏదీ లేదు. ఆయన కంటే కూడా విజయసాయిరెడ్డికే ప్రోటోకాల్ మర్యాదలు ఇస్తున్నారు అధికారులు. ఇక రాజకీయంగా కూడా అవంతి శ్రీనివాసరావు దూకుడు లేదు. మరో వైపు తమను ముంచేసి వచ్చాడని టీడీపీ ఆయన మీద మండుతూంటే తమ పార్టీలో చేరి తమ అవకాశాలను లాగేశారని వైసీపీలోని మరో సెక్షన్ గుస్సా అవుతోంది. మొత్తానికి చూస్తే అవంతి శ్రీనివాసరావుకి అవమానాలు, బిరుదులు, ట్యాగులు తప్ప మినిస్టర్ గా దక్కింది ఏదీ లేదని ఆయన అనుచరవర్గం ఆవేదన చెందుతోంది. మరి కొద్ది నెలల్లో అవంతి మాజీ అవడం ఖాయమని, ఆ మీదట ఎన్నికల్లో ఓడి మాజీ ఎమ్మెల్యే అవుతారు అని కూడా ఆయన వ్యతిరేకులు పాట పాడుతున్నారంటే అవంతి శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చి గెలిచినట్లా. ఓడినట్లా?

Tags:    

Similar News