Ayyanna : అందుకే అయ్యన్న ఆ షరతులు పెట్టారా?

పార్టీ బలహీనంగా ఉంటే నాయకత్వంపై ఒంటికాలి మీద లేచేవాళ్లు అనేకమంది ఉంటారు. బలహీనంగా ఉన్నప్పుడే నాయకత్వానికి డిమాండ్లు అధికంగా వస్తాయి. ఇప్పడు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి [more]

Update: 2021-11-13 00:30 GMT

పార్టీ బలహీనంగా ఉంటే నాయకత్వంపై ఒంటికాలి మీద లేచేవాళ్లు అనేకమంది ఉంటారు. బలహీనంగా ఉన్నప్పుడే నాయకత్వానికి డిమాండ్లు అధికంగా వస్తాయి. ఇప్పడు టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇంచుమించుగా అదే. విశాఖలో అయ్యన్న పాత్రుడు పెడుతున్న డిమాండ్లు చంద్రబాబు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యన్న పాత్రుడు సయితం పార్టీ మరింత బలోపేతం కావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనంటున్నారు.

సీనియర్ నేతగా….

తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడు సీనియర్ నేత. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నారు. చిన్న వయసులోనే మంత్రిగా పనిచేశారు. అయ్యన్న పాత్రుడికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ. అలాంటి అయ్యన్న పాత్రుడు 2014 నుంచి పార్టీ అధినాయకత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. దానికి కారణం గంటా శ్రీనివాసరావును పార్టీ చేరదీయడమే. గంటాకు మంత్రి పదవి ఇవ్వడం సుతారమూ ఇష్టంలేదు.

గంటా అంటే….

అయినా పార్టీ కోసం సంయమనం పాటించారని చెబుతారు. ఇద్దరూ మంత్రులుగా ఉన్నప్పటికీ ఐదేళ్లు ఒకరంటే ఒకరికి పడేది కాదు. బహిరంగ విమర్శలను సయితం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలుకాగా, గంటాశ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే అయ్యన్న ఓడినా యాక్టివ్ గా ఉండగా, గంటా గెలిచినా పార్టీకి ప్రయోజనం లేకుడా పోయింది.

ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరాదంటూ…

ఈ పరిస్థితుల్లో గంటా తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని భావించి టీడీపీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అయ్యన్న పాత్రుడు మాత్రం ఈసారి గంటాకు ప్రాధాన్యత ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. కష్ట సమయంలో పార్టీని వదిలేసిన వారెవ్వరికీ అధికారంలోకి వస్తే ఎలాంటి పదవులు ఇవ్వకూడదని నిర్ణయించాలని అయ్యన్నపాత్రుడు కోరినట్లు తెలిసింది. మొత్తం మీద గంటాకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేయాలని అయ్యన్న పాత్రుడు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుంది.

Tags:    

Similar News