సీనియర్ మోస్ట్ అయ్యన్న సౌండ్ చేస్తున్నారెందుకో?

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఇందులో రెండో మాటకు తావు లేదు. యనమల రామకృష్ణుడైనా, ఆఖరుకు చంద్రబాబు అయినా కూడా అయ్యన్నపాత్రుడు తరువాతనే [more]

Update: 2020-04-11 13:30 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఇందులో రెండో మాటకు తావు లేదు. యనమల రామకృష్ణుడైనా, ఆఖరుకు చంద్రబాబు అయినా కూడా అయ్యన్నపాత్రుడు తరువాతనే టీడీపీలోకి వచ్చిన వారే. ఇక అయ్యన్నకు వ్యూహాల కంటే నోటి దూకుడు ఎక్కువని విమర్శకులు అంటారు. ఆయన తరచూ ఏదో మాట అనడం వివాదాల్లో చిక్కుకోవడం అలవాటు చేసుకున్నారు. కరోనా వైరస్ కి ముందు ఆయన పోలీసుల మీద హాట్ కామెంట్స్ చేసి అడ్డంగా ఇరుక్కున్నారు. ఆయనకు పోలీసు సంఘం మహిళా నేతల నుంచి కూడా గట్టి రిటార్ట్ వచ్చింది. దాంతో చప్పున తగ్గిపోయినట్లుగా కనిపించారు. ఈలోగా కరోనా వైరస్ దేశంలోకి ఎంటర్ కావడంతో అయ్యన్నపాత్రుడు పూర్తిగా ఏకాంతవాసానికి పరిమితం అయ్యారు.

బాబు పిలుపుతో….

ఇక చంద్రబాబు ఈ మధ్య పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా ఉందని, సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని బాబు పిలుపు ఇచ్చారు. అయితే ఆ తరువాత అయ్యన్నపాత్రుడు మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కార్ని విమర్శించి మళ్ళీ వెళ్ళిపోయారు. జగన్ కి ఏమీ తెలియదని, ఆయన లాంటి పాలకుడి చేతిలో ఏపీ ఉండడం ప్రజల దురదృష్టకరమని కూడా హాట్ కామెంట్స్ చేస్శారు. ఇక కరోనా వ్యాధి విస్తరిస్తున్నా సీఎం పట్టించుకోవడంలేదని కూడా అన్నారు. ఇన్ని చెప్పిన అయ్యన్నపాత్రుడు మాత్రం గుమ్మం కదలకుండానే మీడియాని పిలిచి ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని సెటైర్లు పడుతున్నాయి.

సహాయం నిల్…

ఇక మాజీ మంత్రిగా, పలు మార్లు ఎమ్మెల్యేగా అయ్యన్నకు ఏపీ రాజకీయాల్లో రికార్డు ఉంది. ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. అటువంటి అయ్యన్నపాత్రుడు జిల్లా ప్రజలకు ప్రతిపక్ష నేతగా చైతన్యం చేయాల్సి ఉండగా అదేమీ లేనట్లుగా వ్యవహరించ‌డాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. ఇదేదో ప్రభుత్వం పని అన్నట్లుగా అయ్యన్న లాంటి పెద్దలు వదిలేయడం ఏంటని కూడా అంటున్నారు. కరోనా వైరస్ పెను విపత్తు అని, అయ్యన్నపాత్రుడు లాంటి వారికి విమర్శలు ఈ సమయంలో చేయకూడదని తెలియదా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక టీడీపీలో అయ్యన్నపాత్రుడు సహా కీలక నేతలు ఎవరూ కనీసం సహాయం కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు.

లెక్కలు చెప్పాలిట….

సరే జగన్ సర్కార్ మీద విమర్శలు అన్నీ పక్కన పెడితే వైసీపీ మొత్తం ఖజానాని దోచేసిందని అయ్యన్న ఆరోపించడం విడ్డూరమే మరి. ఏపీలో ఖజానాని జగన్ సర్కార్ ఖాళీ చేసి పెట్టిందని, మొత్తం నిధులు ఎక్కడికిపోయాయో చెప్పాలని అయ్యన్నపాత్రుడు నిలదీస్తున్నారు. కేవలం పద్నాలుగు రోజుల వ్యవధిలో మొత్తం ఏపీలో ఖజానా నిండుకుంది అంటే ఏమనుకోవాలని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని నిధులు కావాలని జగన్ దేబిరించడమేంటని కూడా అయ్యన్న తప్పుపడుతున్నారు. ఏపీలో నిధులు లేవా. లేకపోతే ఏం చేశారు. ఈ మొత్తం వివరాలతో జగన్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ నేతలు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం పక్కన పెడితే తిరిగి సర్కార్ని నిందించడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా అపుడే నిద్ర లేచినట్లుగా అయ్యన్న ఏపీలో ఖజానా ఖాళీ అంటూ సౌండ్ చేయడం మాత్రం వింతలోకెల్లా వింతే మరి.

.

Tags:    

Similar News