అవును….అయ్యన్నకి అన్నీ మూసుకుపోయిన్నట్లే

సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ పడినట్లేనా. అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూంటే అవును అనేలాగే సీన్ ఉంది. అయ్యన్నకు [more]

Update: 2020-05-12 03:30 GMT

సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ పడినట్లేనా. అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తూంటే అవును అనేలాగే సీన్ ఉంది. అయ్యన్నకు కుడి భుజం లాంటి సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడిని తెలివిగా వైసీపీలోకి లాగేసిన ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ పార్టీని నర్శీపట్నంలో బాగానే పటిష్టం చేశారు. ఇక అయ్యన్నపాత్రుడు తన కొడుకును ప్రమోట్ చేస్తూండడం కూడా క్యాడర్లో కొంత నిరాశగా ఉంది. అయ్యన్నపాత్రుడు1983 నుంచి టీడీపీలో ఉంటూ అనేక‌ దఫాలుగా గెలిచారు. మూడు సార్లు ఓడిపోయారు. అయితే ఈసారి ఓటమి భిన్నమైనది. అయ్యన్నపాత్రుడు రాజకీయ పునాదులు కదిలించేలా ఈ ఓటమి సాగింది. పాతిక వేల పై చిలులు ఓట్ల తేడాతో పెట్ల ఉమా శంకర్ అయ్యన్నను ఓడించారు. దీంతో అయ్యన్న రాజకీయ శకం పూర్తి అయిందన్న డౌట్లు టీడీపీలోనే వస్తున్నాయి

అనుచరుడే అలా…..

వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఒకనాడు టీడీపీలో నాయకుడే. అన్నింటికీ మించి అయ్యన్నపాత్రుడు అనుచరుడే. గురువు దగ్గరే రాజకీయ ఓనామాలు నేర్చి అదే అయ్యన్నకు ఖంగు తినిపించే ఓటమిని రుచి చూపించారు. నిజానికి 2014 ఎన్నికల్లోనే ఉమ శంకర్ గెలవాలి. నాడు వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాల పాప అయ్యన్నపాత్రుడుకు ఇండైరెక్ట్ గా సహకరించడంతో కేవలం రెండు వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు. ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఆ వర్గమంతా టీడీపీలో ఉన్నా కూడా అయ్యన్నపాత్రుడు ఓడిపోయారు. అయ్యన్నపాత్రుడు గెలుపుల‌కు, ఆయన రాజకీయ‌ మలుపులకు అడుగడుగునా వెన్నుదన్నుగా ఉన్న తమ్ముడినే వైసీపీలోకి ఎమ్మెల్యే తెచ్చేశారు.

కుములుతున్నా…..

తన తమ్ముడు విభీషణుడని, తనని వంచించి వెన్నుపోటు పొడిచాడని అయ్యన్న ఇపుడు తాపీగా కుములుతున్నా ఫలితం లేదు. ఎందుకంటే ఆయన తమ్ముడు వైసీపీ నుంచి అన్నకు సవాల్ చేస్తున్నారు. ఇక తన కొడుకు విజయపాత్రుడిని 2024 నాటికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేను చేయాలని అయ్యన్నపాత్రుడు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ముందుకు సాగడంలేదు. అయ్యన్న రాజకీయమంతా తమ్ముడే చూసేవారు. దాంతో టీడీపీలో ఉన్నవారు ఇపుడు వైసీపీ వైపే చూస్తున్నారు. ఇక అయ్యన్నపాత్రుడుకే నోటి దురుసు అనుకుంటే కుమారుడు కూడా అపరిపక్వ రాజకీయంతో పార్టీలో ఉన్న తమ్ముళ్ళకు కూడా దూరం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తారు మారు…..

రాజకీయ సమీకరణలు కూడా పూర్తిగా తారుమారు అయ్యాయి. యువ నాయకుడు గా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ దూసుకుపోతున్నారు. ఆయన మరింతకాలం ఎమ్మెల్యేగా కొనసాగాలని దీర్ఘకాలిక ప్రణాలికలు వేసుకుంటున్నారు. గతంలో అయ్యన్నపాత్రుడిని ఓడించిన వారు రాజకీయంగా బలంగా ఉన్న వారు కారు. పైగా ఆ గెలుపులు పూర్తిగా గాలివాటం. దాంతో అయ్యన్నపాత్రుడు త్వరగానే కోలుకున్నారు. ఇపుడు ఉమా శంకర్ కార్యకర్త స్థాయి నుంచి వచ్చారు. ఆయనకు రాజకీయ పట్లూ, ఒడుపులు బాగా తెలుసు. దాంతో గురువు అయ్యన్నకే దగ్గులు నేర్పుతున్నారు. ఈ పరిణామాలు చూసుకుంటే అయ్యన్నపాత్రుడు రాజకీయ ఆశలకు చెక్ పడిపోయినట్లేనని అంటున్నారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు, జగన్ కి కూడా నచ్చిన ఎమ్మెల్యేగా ఉమా శంకర్ ఉన్నారు. రానున్న రోజుల్లో జగన్ దయతలిస్తే ఆయన మంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే అయ్యన్నపాత్రుడు రాజకీయానికి పూర్తిగా దారులు మూసుకుపోయినట్లే.

Tags:    

Similar News