అయ్యన్న నోటి దురద కొంప ముంచిందా … ?

చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు చెప్పగానే టిడిపి లో ఉన్న అతికొద్ది మంది ఫైర్ బ్రాండ్స్ లో ఒకరుగా పేరుంది. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా [more]

Update: 2020-06-17 11:00 GMT

చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు చెప్పగానే టిడిపి లో ఉన్న అతికొద్ది మంది ఫైర్ బ్రాండ్స్ లో ఒకరుగా పేరుంది. పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు నిప్పు రాజేసేవిగానే ఉంటాయన్నది అందరికి తెలిసిందే. అయ్యన్నకు చిర్రెత్తికొస్తే తన పర ఏమి ఉండవన్నది ఆయన తీరు గమనించేవారందరికి సుపరిచితమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన అతికొద్దిమందిలో అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు కావడంతో ఆయన ఎలాంటి పని చేసినా అధినేత చంద్రబాబు సైతం ఆచితూచి చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతూ ఉంటారు. సొంత పార్టీలో సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు పై అయ్యన్నపాత్రుడు పేల్చే తూటాల్లాంటి మాటలను సైతం అధిష్టానం పట్టించుకోనట్లే ఉంటుంది. గత ఎన్నికల్లో అయ్యన్న జగన్ సునామీ లో చిత్తయిపోయారు.

ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది ….

సీనియర్ గా అయ్యన్నపాత్రుడుకు పార్టీ బాగా స్వేచ్ఛ ఇచ్చిందనుకోవాలో లేక ఆయన నోట్లో నోరు పెట్టి మరిన్ని తిట్లు ఎందుకు తినడం ఎందుకని వెనక్కి తగ్గుతారో కానీ అయ్యన్న దూకుడుకు టిడిపి లో ఇప్పటి వరకు బ్రేక్ లు వేసిందే లేదు. గత ఎన్నికలకు ముందు టిడిపి తెలంగాణాలో కాంగ్రెస్ తో దోస్తీ చేయడం ఆ తరువాత ఎపి లో కూడా హస్తం తో జత కట్టే వెళుతుందన్న వార్తలపై అయ్యన్నపాత్రుడు అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. టిడిపి సిద్ధాంతానికి భిన్నంగా కాంగ్రెస్ తో కలిసి నడిస్తే ప్రజలు చెప్పులతో కొడతారంటూ సంచలన వ్యాఖ్యలే చేసి పార్టీ లో హాట్ టాపిక్ అయ్యారు. ఇలా ఒకటి కాదు అనేక వివాదాస్పద వ్యాఖ్యలకు అయ్యన్నపాత్రుడు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. వైసిపి అధినేత జగన్ పైనా, పార్టీ పైనా అయ్యన్న విరుచుకుపడటమే కాదు కొరకరాని కొయ్యగా ఉన్నారు. ఇటీవలే నర్సీపట్నం డాక్టర్ అయ్యన్న ను కలిసిన తరువాత ప్రభుత్వాన్ని విమర్శించారనే ఆరోపణలు వచ్చాయి. అయ్యన్నపాత్రుడు తరహాలోనే చెలరేగిన డా. సుధాకర్ ఉద్యోగాన్ని కోల్పోవడమే కాదు మానసిక స్థితి సైతం సరిలేక చిక్కులు పాలయ్యారు కూడా.

వేచి చూస్తున్న వైసిపి …

అలాంటి ఫైర్ బ్రాండ్ ఎప్పుడు చిక్కుతారా అని అధికార వైసిపి ఎదురు చూస్తూ ఉంది. వారి ఆశ అడియాస చేయకుండా అయ్యన్నపాత్రుడు తొందరగానే తన నోటి దురద కారణంగా బుక్ అయిపోయారు. అదీ కూడా నర్సీపట్నం కమిషనర్ పై అనుచిత ప్రవర్తన కు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యవహరించిన తీరు నిర్భయ, దిశా చట్ట పరిధిలోనికి వచ్చేలా ఉన్నాయని కంప్లైంట్ పై కేసు నమోదు చేసేసారు పోలీసులు. ఇది కాకుండా గత కొద్ది రోజులుగా అయ్యన్నపాత్రుడు కొన్ని వివాదాస్పద వ్యవహారాల్లో చిక్కుకోవడంతో మరో మూడు కేసులు నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లోనే నమోదు అయి పోయాయి. ఒక భూ వివాదంతో పాటు మరికొన్ని వ్యవహారాల్లో మాజీ మంత్రి బుక్ అయిపోయారు. ఆ కేసులు ఎలా ఉన్నా నిర్భయ, దిశా వంటి కేసులు ఒక మాజీ మంత్రి పై నమోదు కావడం మాత్రం ఇప్పటివరకు జరగలేదు.

అసలేమీ జరిగింది…

అయ్యన్నపాత్రుడు తాత చాలాకాలం పాటు నర్సీపట్నం సర్పంచ్ గా గతంలో పనిచేశారు. ఆయన చిత్ర పటం మునిసిపల్ కార్యాలయంలో చిరిగి ఉండటంపై అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మునిసిపల్ కమిషనర్ పై చెలరేగారు. కోవిడ్ నిబంధనలను సైతం పక్కన పెట్టి టిడిపి శ్రేణులతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అయన వాడిన భాష, కమిషనర్ ను నిందించిన తీరు అయ్యన్నపాత్రుడుకు ఎసరు తెచ్చాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన కమిషనర్ నేరుగా పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దాంతో ఇప్పుడు అయ్యన్న అరెస్ట్ అచ్చెన్న అరెస్ట్ లాగే అల్లరికి తెరతీసేలా ఉంటుందా లేక మరికొన్ని ట్విస్ట్ లు ఇందులో జరుగుతాయా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News