అయ్యన్న అగ్రహం వెనక…?
చంద్రబాబు కంటే నేనే సీనియర్ అని అంటారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అది నిజం కూడా. చంద్రబాబు 1983లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి పోటీ [more]
చంద్రబాబు కంటే నేనే సీనియర్ అని అంటారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అది నిజం కూడా. చంద్రబాబు 1983లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి పోటీ [more]
చంద్రబాబు కంటే నేనే సీనియర్ అని అంటారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. అది నిజం కూడా. చంద్రబాబు 1983లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి పోటీ చేస్తే అయ్యన్నపాత్రుడు మాత్రం తెలుగుదేశం జెండా పట్టి సైకిల్ గుర్తు మీద నెగ్గిన అచ్చమైన తమ్ముడు. ఆ తరువాత పరిణామాల నేపధ్యంలో బాబు మామ గారి పార్టీలోకి వచ్చారు. అలా చూస్తే టీడీపీలో ఇపుడున్న వారిలో అయ్యన్నపాత్రుడు వంటి కొద్ది మంది మాత్రమే సీనియర్లు ఉన్నారు. వారు ఎన్టీయార్ కాలం నాటి పార్టీ వైభోగాన్ని కళ్ళారా చూసిన వారు, చంద్రబాబు హయాంలో పార్టీ పడుతున్న పాట్లు, పతనాన్ని కూడా ఇపుడు స్వయంగా చూస్తున్నారు.
బాధ్యతతోనేనా…?
అందువల్ల అయ్యన్నపాత్రుడు లాంటి వారి మాటలకు టీడీపీలో ఎపుడూ విలువ ఉంటుంది. వారికి అలా చెప్పే హక్కూ, బాధ్యత కూడా ఉంటాయని అంతా అంగీకరిస్తారు. నిజానికి ఈ సమయంలో చెప్పాలి కూడా. టీడీపీలో మిగిలిన సీనియర్లు ఎలాంటి ఆలోచనలతో ఉన్నా కూడా మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు కక్కేసే అయ్యన్నపాత్రుడు ఉండబట్టలేరు అంటారు. అందుకే ఆయన తెలంగాణాలో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అన్న వార్తలు వచ్చిన నాడే చెప్పారు. ఈ పొత్తును జనం చిత్తు చేస్తారు. అలా చేస్తే బట్టలూడదీసి కూడా కొడతారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు, చివరికి తెలంగాణా ఫలితాలు ఆ సంగతిని చెప్పాయి కూడా.
పట్టించుకోలేదుగా…?
చంద్రబాబు వ్యూహాలు, తెలివిని ఇపుడు తమ్ముళ్ళు పెద్దగా నమ్మడంలేదు. ఆ మాటకు వస్తే 2014 కి ముందు చంద్రబాబు తరువాత అన్న విభజనను కూడా తమ్ముళ్ళు ఆయన గురించి విశ్లేషించినపుడు చెబుతారు. చంద్రబాబు సొంత ఆలోచనలు ఇపుడు పార్టీలో లేవని కూడా అంటారు. ఆయన మీద కొడుకు లోకేష్ ప్రభావంతో పాటు, అనుకూల మీడియాధిపతుల సలహాలు, భజన చేసే వారి సూచనలు బాగా ప్రభావం చూపిస్తున్నాయని కూడా అంటారు. అయ్యన్నపాత్రుడు లాంటి సీనియర్లకు బాబు ఎపుడూ విలువ ఇవ్వరని కూడా అనుచరులలో బాధ ఉంది.
మూలన పెట్టేశారా?
ఇక అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్ ఉండగా ఆయన కంటే జూనియర్ అయిన అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ఇస్తానని బాబు ప్రతిపాదించడాన్ని కూడా అయ్యన్నపాత్రుడు అభిమానులు తప్పుపడుతున్నారు. ఇక బాబు అధికారంలో ఉన్నపుడు కూడా ఉత్తరాంధ్రాకు కచ్చితంగా ఉప ముఖ్యమంత్రి ఇస్తారని చూసారు. అది అయ్యన్ననే వరిస్తుందని ఆశపడ్డారు. కానీ బాబు మాత్రం కనీసం అయ్యన్నను పరిశీలనలోకి తీసుకోలేదు. ఏదో పేరుకు పొలిట్ బ్యూరో మెంబర్ గా కొనసాగిస్తున్నారు. ఇలా తనను, తన సీనియారిటీని పక్కన పెడుతున్న బాబు మీద అయ్యన్నపాత్రుడుకు గుస్సా ఉందని, అది ఇలా సందర్భానుసారం బయటకు వస్తోందని అంటున్నారు. మొత్తానికి అయ్యన్నపాత్రుడు విషయంలో బాబు ఆలోచనలు ఎలా ఉన్నా ఈ మాజీ మంత్రి మాత్రం బాబుపోకడలు ఇలాగే ఉంటే టీడీపీ పుట్టె మునగడం ఖాయమని అంటున్నారుట.