చేజేతులా చేజార్చుకున్నారు… వలవేసి పట్టుకున్నారు
మణిపూర్ ను కమలనాధులు కాపాడుకోగలిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో చిక్కడంతో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం నిలదొక్కుకున్నట్లయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా [more]
మణిపూర్ ను కమలనాధులు కాపాడుకోగలిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో చిక్కడంతో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం నిలదొక్కుకున్నట్లయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా [more]
మణిపూర్ ను కమలనాధులు కాపాడుకోగలిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో చిక్కడంతో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం నిలదొక్కుకున్నట్లయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ కు అనుకూలంగా ఓటు వేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టెక్కించారు. అనంతరం తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ముగిసిిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో బీజేపీ ని దెబ్బకొట్టే ఛాన్స్ ను కాంగ్రెస్ పార్టీ తనంతట తానే కోల్పోయిందని చెప్పాలి.
తక్కువ స్థానాలొచ్చినా…..
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు 2017లో జరిగాయి. మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ 21 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా మరో పది మంది సభ్యుల మద్దతు అవసరం. అదే సమయంలో కాంగ్రెస్ 28 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని అతిపెద్ద పార్టీ గా అవతరించింది. కానీ బీజేపీకి ఎన్.పి.పి, నాగటా పీపుల్స్ ఫ్రంట్, , టీఎంసీ, లోక్ జనశక్తి పార్టీ, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో బీజేపీ తొలిసారిగా మణిపూర్ లో అధికారంలోకి వచ్చింది.
బీజేపీ ఎమ్మెల్యేల అసంతృప్తితో….
అయితే ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వైఖరికి నచ్చక, మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు అసంతృప్తికి గురయ్యారు. దీంతో బీజేపీ నుంచి ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు అప్పట్లో చేరారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసంతృప్తికి గురై 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. దీంతో బీరెన్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దీంతో కాంగ్రెస్ అక్కడ బీరెన్ సింగ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది. గవర్నర్ ను కలసి కూడా ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ గట్టెక్కించింది….
ఈ నేపథ్యంలో బీజేపీ మరోమారు కాంగ్రెస్ నేతలకు వల విసిరింది. మణిపూర్ రాజకీయాలు స్పష్టంగా తెలుస్తున్నా కాంగ్రెస్ అధినాయకత్వం వారిని బుజ్జగించే చర్యలు చేపట్టలేకపోయింది. రాజస్థాన్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. దీంతో మణిపూర్ లో అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. ఆరుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ కు రాజీనామాలేఖలు సమర్పించారు. కాంగ్రెస్ నేత లబోబి సింగ్ నాయకత్వాన్ని వారు వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఒడ్డున పడినట్లయింది.