రామోజీ కి బ్యాడ్ పిరియడ్ స్టార్ట్ అయ్యిందా …?
మీడియా మొఘల్ రామోజీ రావు కి బ్యాడ్ పిరియడ్ మొదలైందంటున్నారు విశ్లేషకులు. హై కోర్టు లో తన శక్తి యుక్తులను వినియోగించి కొట్టేయించుకున్న మార్గదర్శి కేసు సుప్రీం [more]
మీడియా మొఘల్ రామోజీ రావు కి బ్యాడ్ పిరియడ్ మొదలైందంటున్నారు విశ్లేషకులు. హై కోర్టు లో తన శక్తి యుక్తులను వినియోగించి కొట్టేయించుకున్న మార్గదర్శి కేసు సుప్రీం [more]
మీడియా మొఘల్ రామోజీ రావు కి బ్యాడ్ పిరియడ్ మొదలైందంటున్నారు విశ్లేషకులు. హై కోర్టు లో తన శక్తి యుక్తులను వినియోగించి కొట్టేయించుకున్న మార్గదర్శి కేసు సుప్రీం కోర్టు లో తిరిగి పురుడు పోసుకోవడం చిన్న విషయం కాదంటున్నారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ దాఖలు చేసిన ఈ కేసు పై ఇప్పుడు విచారణ మొదలై ఆరోపణలు రుజువు అయిన పక్షంలో ఖాతాదారులనుంచి డిపాజిట్లగా సేకరించిన 2600 కోట్ల రూపాయలుకు డబుల్ అమౌంట్ జరిమానా విధించబడుతుంది. అంటే 5200 కోట్ల రూపాయలను రామోజీ రావు చెల్లించాలిసి వస్తుంది. అంతే కాకుండా రెండున్నరేళ్ల వరకు జైలు శిక్షకు అవకాశం ఉంది. వృద్ధాప్యం లో ఉన్న రామోజీ కి ఈ సమస్య ఒక సవాల్ నే అంటున్నారు.
ఈనాడు క్లోజ్ చేస్తారంటూ ప్రచారం ….
ఇటీవల కరోనా దెబ్బతో ఈనాడు పత్రికలో వందలమంది ఉద్యోగులను రామోజీ సంస్థ తొలగించింది. వారంతా కష్టకాలంలో రోడ్డున పడి లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని నిరసనలు, ఆందోళనలు చేపడుతూ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. కరోనా కు ముందు ఎపి లో జగన్ సర్కార్, తెలంగాణ లో కెసిఆర్ ప్రభుత్వాలు వచ్చాకా ఈనాడు పత్రిక హవా మసకబారుతూ వస్తుంది. పత్రికా రంగంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాక్షి, నమస్తే తెలంగాణ ల నుంచి వస్తున్న పోటీ కి తోడు న్యూస్ ప్రింట్ ధరలు బాగా పెరిగిపోవడం తో పాటు ఇతర ఖర్చులు తడిసి మోపుడవ్వడంతో ఈనాడు నష్టాల బాట పట్టిందంటున్నారు. సర్క్యులేషన్ సైతం 60 శాతం పడిపోవడం, ప్రకటనలు రాక పోవడంతో ప్రస్తుతం 6 రూపాయలకు విక్రయిస్తున్న పత్రికకు 12 రూపాయలు జేబు నుంచి ఈనాడు యాజమాన్యం ఖర్చు చేయాలిసి వస్తుంది. దాంతో తెల్ల ఏనుగులా మారిన తనకు ఇష్టమైన పత్రికను మూసేసి డిజిటల్ మీడియా పైనే ఫోకస్ చేయాలని రామోజీ భావిస్తున్నట్లు మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చ సాగుతుంది. తన సంస్థలు నష్టాల బాట ఒక పక్క సాగుతుండగానే మార్గదర్శి కేసు మరోసారి మెడకు చుట్టుకోవడం రాజగురు గా రాజకీయాల్లో అంతా పిలుచుకునే రామోజీ రావు కి కష్టకాలం దాపురించిందని లెక్కేస్తున్నారు విశ్లేషకులు.
ఉండవల్లి రాజీ పడలేదు …
వాస్తవానికి వైఎస్ మరణం తరువాత రామోజీ రావు కి కాంగ్రెస్ పెద్దలతో కుదిరిన రాజీతో ఈ కేసులో వేగం మందగించిందన్నది రాజకీయ వర్గాలకు తెలిసిందే. అయితే ప్రజల్లో మాత్రం ఉండవల్లి అరుణ కుమార్ రామోజీ ల నడుమ రహస్య అవగాహనతో కేసు క్లోజ్ అయినట్లు బలమైన ప్రచారమే సాగింది. అయితే ఉండవల్లి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఈ కేసును హై కోర్టు లో రామోజీ రావు కొట్టించుకున్నా సుప్రీం కోర్టకు కు వెళ్ళి కేసు రీ ఓపెన్ అయ్యేలా కృషి చేసి విజయం సాధించారు. దాంతో ఆయన మొదలు పెట్టిన ఈ అంకం అంతు చూసే దాకా వదలరని తెలుగు రాష్ట్ర ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. కేసు విచారణ మొదలైతే తొందరగానే దీని యవ్వారం తేలిపోతుందని న్యాయనిపుణులు భావిస్తున్నారు. అయితే ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్న రామోజీ రావు దీనినుంచి ఎలా బయటపడతారా అన్నది ఆసక్తికర చర్చకు తెరతీస్తోంది.